calender_icon.png 29 August, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన సింధు

29-08-2025 05:54:27 AM

  1. వరల్డ్ నం.2కు షాక్ ఇచ్చిన సింధు
  2. చాలా రోజుల అనంతరం సత్తా చాటిన ఒలింపిక్ మెడలిస్ట్

న్యూఢిల్లీ, ఆగస్టు 28: గతమెంతో ఘనం.. కానీ ప్రస్తుతం శూన్యం అన్న వ్యాఖ్య పీవీ. సింధుకు సరిగ్గా సరిపోతుందేమో. రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ఈ బ్యాడ్మింటన్ స్టార్ కొన్ని రోజులుగా సరైన ప్రదర్శన చేయ డం లేదు. చాలా రోజుల తర్వాత పారిస్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో క్వార్డర్స్‌లోకి దూసుకెళ్లింది.

గురు వారం పారిస్ వేదికగా జరిగిన ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లో వరల్డ్ నం.2 వాంగ్ జీ యీ (చైనా)పై 21-17, 21-15 తేడాతో వరుస సెట్ల లో విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాం పియన్‌షిప్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లడం 2021 తర్వాత ఇదే తొలిసారి.

శుక్రవారం వరల్డ్ 9వ సీడ్ ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వార్దానిపై విజయం సాధిస్తే సింధుకు ఏదో ఒక పతకం ఖాయం అవుతుంది. సింధు ఇప్పటికే ఐదు బీడబ్ల్యూఎఫ్ పతకాలు గెలుచుకుంది. సింధు రియో ఒలింపిక్స్‌లో రజతం, 2019 వరల్డ్ చాంపియన్‌షి ప్‌లో బంగారు పతకం సాధించింది.