calender_icon.png 5 October, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎస్‌ఎస్‌గా చెన్నూరివాసి

05-10-2025 01:02:09 AM

కొమ్మెర సతీష్‌కు అభినందనలు

చెన్నూర్, అక్టోబర్ 4: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని విశ్వకర్మ కాలనీకి చెందిన కొమ్మెర సతీష్ ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్సీ (ఐఈఎస్, ఐఎస్‌ఎస్) ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. కొమ్మెర సతీష్‌ను శనివారం మున్సిపల్ మాజీ చైర్మన్ అర్చనెేరామ్‌లాల్ గిల్డా దంపతులు కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాలతో సత్కరించారు. సతీష్ తండ్రి కొమ్మెర బ్రహ్మయ్య వృత్తి రీత్యా వాస్తు నిపుణులు.

ఈ కార్యక్రమంలో చెన్నూర్ మాజీ కౌన్సిలర్స్ జోడు శంకర్, రేవెల్లి మహేష్, జగన్నాధుల శ్రీను, వేముల మహేందర్, మేడ సురేష్ రెడ్డి, పెండ్యాల లక్ష్మణ్, మాన్శెట్టి శ్రీనివాస్, భూపాల లక్ష్మణ్, నయబ్, కొప్పుల రవీందర్, జాకీర్, అన్వర్, దేవేందర్, పట్టణ ప్రముఖులు పులి కిషోర్, పెద్దింటి శ్రీనివాస్, నడిపెల్లి లక్ష్మణరావు, రేవెల్లి సత్యనారాయణ, చెన్నూర్ పట్టణ బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.