05-10-2025 12:52:47 AM
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటాసైన్స్‌తో పెరుగుతున్న డిమాండ్
డిప్లొమా, డిగ్రీ, పీజీ కంటే ఇంజినీరింగ్‌కే విద్యార్థుల్లో క్రేజ్ ఎక్కువ
హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాం తి): రాష్ట్రంలో ఇంజినీరింగ్‌కు క్రేజ్ తగ్గడంలేదు. ఏ కోర్సుకైనా క్రేజ్ తగ్గుతుందేమోకానీ, ఇంజినీరింగ్‌కు మాత్రం తగ్గదు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా సాం కేతికతను ఇంజినీరింగ్ విద్య అం దిపుచ్చుకోవడంతోపాటు, మార్కెట్ డిమాండ్‌ను బట్టి కొత్త కొత్త కోర్సులు, ప్రోగ్రామ్‌లు వస్తున్నాయి.
డిగ్రీ, పీజీ, డిప్లొ మా కోర్సులకు రాను రాను ఆదరణ తగ్గుతున్నప్పటికినీ క్రేజ్ తగ్గని కోర్సు ఏదైనా ఉందంటే అది ఇంజినీరింగే. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులతో డిమాండ్ పెరుగుతోంది.
భవిష్యత్ అదొక్కటే అనేలా..
ప్రపంచవ్యాప్తంగా వస్తు న్న మార్పుల కారణంగా పలు కంపెనీలు ఉద్యోగాల్లో కోతపెడుతున్నప్పటికీ ఇంజినీరింగ్ విద్యనే విద్యా ర్థులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ కోర్సులో చేరితే మంచి ప్యాకేజీతో ఉద్యోగావకాశాలు లభిస్తాయని, భరోసా ఉంటుం దనే భావనతో విద్యార్థులు ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్‌నే ఎంచుకుంటున్నారని అధికారులు చెపుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రతి ఏటా ఎంతో కొంత అడ్మిషన్లు పెరుగుతున్నా యి. మిగతా కోర్సుల్లో పరిస్థితి దీనికి పూర్తి గా భిన్నంగా ఉంటుంది. డిగ్రీలో సుమారు 4.50 లక్షల సీట్లుంటే నిండేది మాత్రం ౩ లక్షల లోపే. కానీ ఇంజినీరింగ్‌లో మాత్రం 5 వేల నుంచి 10 వేలలోపు సీట్లు మిగులుతాయి. గత ఆరేళ్లలో ఇంజినీరింగ్ విద్యలో దాదాపు 40 వేల వరకు అడ్మిషన్లు పెరిగాయి.
2019లో 46,134 వేల మంది ఇంజినీరింగ్ విద్యలో చేరగా, 2025 మాత్రం ఏకంగా 83,520 మంది చేరడం గమనార్హం. గతంలో 50 నుంచి 60 శాతం వరకు మాత్రమే సీట్లు భర్తీ అయ్యేవి. కానీ కొన్నేండ్లుగా 85 శాతం నుంచి 90 శాతంపైగా సీట్లు నిండుతున్నాయి. ఇక డిమాండ్ ఉన్న సీఎస్‌ఈ లాంటి బ్రాంచిల్లోనైతే వంద శాతం సీట్లు భర్తీ అవుతున్నాయి.
పెరిగిన కన్వీనర్ కోటా సీట్లు
రాష్ట్రంలో ఏటా ఎంతో కొంత ఇంజినీరింగ్ సీట్లు పెరుగుతున్నాయి. మరోవైపు కాలేజీలు తగ్గుతున్నాగానీ సీట్లు మాత్రం పెరుగుతున్నాయి. 2019లో కాలేజీలు 183 ఉంటే, అందులో మొత్తం సీట్లు 65,565, భర్తీ అయిన సీట్లు 46,134. 2020లో 181 కాలేజీల్లో 70,135 సీట్లలో 47,739 నిండాయి.
2021లో 175 కాలేజీల్లో 79,822 సీట్లలో 57,545 సీట్లు, 2022లో 177 కాలేజీల్లో 79,448 సీట్లలో 62,170 సీట్లు, 2023లో 174 కాలేజీల్లో 82,702 సీట్లలో 70,689 సీట్లు, 2024లో 175 కాలేజీల్లో 86,943 సీట్లలో 75,107 సీట్లు, ఈఏడాది 172 కాలేజీల్లో 91,495 కాలేజీల్లో 83,520 సీట్లు నిండాయి. ప్రతీ ఏటా 4 వేల నుంచి 10 వేలలోపు అడ్మిషన్లు పెరిగాయి. సీట్లు కూడా ప్రతి ఏటా 4 వేల నుంచి 5 వేలకుపైగా వరకు సీట్లు పెరుగుతున్నాయి.