calender_icon.png 5 October, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీకి మళ్లీ పోటెత్తిన వరద

05-10-2025 12:37:45 AM

జంట జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

మూసీకి పెరుగుతున్న ప్రవాహం

-ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం

-లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన యంత్రాంగం

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబరు 4 (విజయక్రాంతి): మూసీ నదికి వరద ప్రవా హం మరోసారి పెరిగింది. నగరానికి మరోసారి భారీ వర్ష సూచన పొంచి ఉండటంతో వాతావరణ కేంద్ర ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ గా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ముందుజాగ్రత్త చర్యగా జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ గండిపేట, హిమాయ త్‌సాగర్‌ల గేట్లను శుక్రవారం ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు.

దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉస్మాన్‌సాగర్ కు ఇన్‌ఫ్లో 100 క్యూసెక్కులు నమోదవుతుండగా 4 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి 920 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌కు 400 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా ఉండగా ఒక గేటు 3 అడుగుల మేర ఎత్తి 1,017 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నదికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. అయితే ఆరెంజ్ అలర్ట్ దృష్ట్యా నీటి విడుదలను దశలవారీగా భారీగా పెంచనున్నట్లు జలమం డలి ప్రకటించింది.

హిమాయత్‌సాగర్ నుం చి నీటి విడుదలను 2000 క్యూసెక్కులకు, ఉస్మాన్‌సాగర్ నుంచి 3000 క్యూసెక్కులకు పెం చాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మూసీ నది పరివాహక ప్రాంతాలైన చాదర్‌ఘాట్, మూసారాంబాగ్, అంబర్‌పేట్, పురానాపూల్, జియా గూడ తదితర లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

జలమండలి ఎండీ సి అశోక్‌రెడ్డి శనివారం ఉదయం ఉన్నతాధికారులతో కలిసి జంట జలాశయాలను సందర్శించారు. జలాశయాల్లోకి వస్తున్న వరద ప్రవాహాన్ని, నీటి మట్టాలను స్వయంగా సమీక్షిం చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేం దుకు, ముందస్తుగా నీటిని దిగువకు విడుదల చేయాలని అక్కడికక్కడే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.