calender_icon.png 5 October, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయాకు మద్దతు ధర లభించేనా?

05-10-2025 12:03:24 AM

-ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఊసెత్తని సర్కార్

-గణనీయంగా తగ్గనున్న సోయా దిగుబడులు

-మద్దతు ధర దక్కితేనే అన్నదాతకు మేలు

నిర్మల్, అక్టోబర్ 4(విజయక్రాంతి): వాన కాలంలో సాగుచేసిన సోయా  పంటకు మద్ద తు ధరపై రైతులు ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈసారి సోయా పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. వాన కాలంలో సాగుచేసిన సోయా పంట ప్రస్తుతం కోతకు వస్తున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఇంకా స్పష్టత లేకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 1,20 లక్షల ఎకరాల్లో సోయా పంట సాగుచేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్వయపంటకు మద్దతులను క్వింటాలుకు 53 80 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. మద్దతు ధర తగ్గాలంటే ప్రభుత్వం వెంటనే జిల్లా వ్యాప్తంగా మార్పిడి ఆదరణ సోయా పంట కొనుగోలను ఏర్పాటు చేయవలసి ఉంది.

ఇప్పటికీ మార్క్ఫెడ్ కొనుగోళ్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ప్రభు త్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ కొనుగోలు ఉంటాయా ఉంటాయా అని అనుమా నం కలుగుతుందని రైతులు వాపోతున్నారు. ఈ సంవత్సరం వర్షాకాల ప్రారంభం నుంచి అధిక వర్షాలు కురవడం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సోయా పంట అనుకున్న స్థాయి లో దిగుబడులు వచ్చే అవకాశాలు లేదని రైతులు తెలిపారు. గతంలో సోయా పంట దిగుబడులు ఎకరానికి 6 నుంచి 8 గంటల వరకు దిగుబడి వచ్చేవన్నీ ఇప్పుడు అది మూడు నుంచి నాలుగు కుంటలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని రైతులు తెలిపారు. జిల్లాలోని సారంగాపూర్ దిల్వార్పూర్ కుంటాల కుబీర్ తానూర్ మామడ ముధోల్ బాసర్ లోకేశ్వరం తదితర మండలాల్లో రైతులు సాగుచేసిన సోయా పంట కోతకు రావడంతో కోతలు కోసి పంటలు ఆరబెట్టెందుకు రైతులు సిద్ధమవుతున్నారు

ప్రభుత్వ మద్దతు ధర దక్కితేనే లాభం

నిర్మల్ జిల్లాలో సోయా పంట సాగుచేసిన రైతులకు ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు లక్కితేనే లాభం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సోయా కు 53 80 రూపాయల మద్దతు ధరను ప్రకటించిన విషయం అందరికీ తెలిసింది. జిల్లాలో మార్కెట్ ద్వారా ఐదు మార్కెట్ కమిటీ పరిధిలోని ఎనిమిది పంట కొనుగోలు కేంద్రా లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన కొనుగోల నిర్వహణపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అనుమానంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో రైతులు సాగు పంటలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ప్రైవేట్ దళారుల వద్ద పంటను విక్రయించవలసి వస్తుంద ని అంటున్నారు. ప్రస్తుతం దళారులు 4,500 వరకు కొనుగోలు చేస్తున్నారని వర్షాల కారణంగా ధాన్యం గింజలు నిలబడడం పంట నాణ్యతగా లేదన్న సాగుతూ వారు ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం గానీ ప్రైవేటు దళారుల వద్ద మద్దతు ధరలు దక్కిన చర్యలు తీసుకోవడంగానీ చేపడితేనే రైతులకు ప్రయోజనంగా ఉంటుందని జిల్లా రైతులు కోరుతు న్నారు. పంట కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఇప్పటికే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జులు మొరపెట్టుకున్నప్పటికీ ఆ దిశగా చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోవడంపై జిల్లాలో సోయా  రైతులు ఆందోళన చెందుతున్నారు.