16-10-2025 04:30:37 PM
కుభీర్ (విజయక్రాంతి): కుభీర్ మండలంలోని కుప్టి గ్రామానికి చెందిన(వీబిఓ) ఆర్టీసీ ఉల్చ సుధాకర్ బాబు తల్లి మాతృమూర్తి ప్రేమలబాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా గురువారం ముద్హోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కుభీర్ ఏఎంసీ చైర్మన్ గోనే కళ్యాణ్, మాజీ సర్పంచ్ పానాజీ విజయకుమార్, శంకర్ చౌహన్, మహిపాల్ రెడ్డి, బంక ఆనంద్, బండి సుభాష్, గోపాల్, పడిగెటి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.