calender_icon.png 16 October, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకొని వ్యక్తి మృతి..

16-10-2025 04:26:16 PM

లక్షేట్టిపేట: మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన వావిలాల రమేష్(39) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడని గురువారం ఎస్సై సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వృత్తిరీత్యా లారీ డ్రైవర్ అతిగా మధ్యానికి బానిసయ్యాడన్నారు. ఇంట్లో వాళ్ళు మానుకోమని చెప్పిన మద్యం అలవాటు మానలేదు. ఈనెల 14న మంచిర్యాల వెళ్లి మధ్యాహ్నం అతిగా మద్యం సేవించి వచ్చి మద్యం మత్తులో ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో రేకుల కింది వాసనికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడన్నారు. మృతుని భార్య రజిని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.