16-10-2025 04:24:44 PM
దౌల్తాబాద్: మండలంలోని గువ్వలేగి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి తల్లి మరణించిన విషయం తెలుసుకొని బీజేపీ మండల పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలన్నారు. మాజీ మండల అధ్యక్షుడు సర్వుగారి భూపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కురుమ గణేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజు, బూత్ అధ్యక్షులు రవి, వేణు, కొండల్ రెడ్డి, బొల్లం రాజు తదితరులున్నారు.