calender_icon.png 16 October, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

16-10-2025 04:40:10 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్ లోని బికె గూడలో శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు పార్థసారధి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తమ వయసును సైతం లెక్క చేయకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యల బారినపడి అనేకమంది పేదలు ఆర్ధిక ఇబ్బందులతో సరైన వైద్యం పొందలేకపోతున్నారని చెప్పారు.

పేద ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అనే గొప్ప కార్యక్రమాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని కొనసాగించారని వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత వైద్యం అందని ద్రాక్షలా మారిందని విమర్శించారు. ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేద ప్రజలు అధికంగా నివసించే బస్తీలలో మరిన్ని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని హాస్పిటల్ నిర్వాహకులను కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నిర్వాహకులు పార్థసారధి, ఆమ్ స్టర్ హాస్పిటల్ డాక్టర్ లు ప్రియాంక, సురేష్, సీనియర్ సిటిజన్ సభ్యులు దూబే, మానిక్ రావ్ పాటిల్, అనంత రెడ్డి, నాయకులు కర్నాకర్ రెడ్డి, సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, ఖలీల్, అశోక్ యాదవ్, గోపిలాల్ చౌహాన్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, పీయూష్ గుప్తా, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.