16-10-2025 04:33:35 PM
గుండాల (విజయక్రాంతి): గుండాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ ఎంపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న అల్లె అనుష్క జిల్లాస్థాయి కబడ్డీలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎన్నికైంది. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10 నుండి 12వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని ప్రశంసా పత్రం అందుకొన్నారు. కొర్న సాత్విక్, పి. మాళవికలు జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి అండర్-19 వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు పి. మహేష్ ను ఆదర్శ కళాశాల ప్రిన్సిపాల్ జి రాము అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.