16-10-2025 04:22:53 PM
బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి సతీష్ గౌడ్..
దేవరకొండ (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వాలనే డిమాండ్ తో అక్టోబర్ 18న నిర్వహించే బీసీల తెలంగాణ రాష్ట్ర బంద్ లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి సతీష్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం దేవరకొండలోని ఐబి గెస్ట్ హౌస్ వారు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. తెలంగాణ బంద్ లో విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా పాల్గొని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి మల్లేష్, సురకారపు సత్యం గౌడ్, మండల బొడ్డుపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు.