calender_icon.png 16 October, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

16-10-2025 04:20:28 PM

డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహారావు

తుంగతుర్తి (విజయక్రాంతి): పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పిల్లల ఎదుగుదల, శారీరక, మానసిక వికాసం కోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహారావు అన్నారు. గురువారం మండల పరిధిలోని కొత్తగూడెం రైతు వేదికలో నిర్వహించిన తుంగతుర్తి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీజ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా తహసిల్దార్ దయానందం, మార్కెట్ చైర్మన్, జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మహిళలు, గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు.

ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేందుకు సమాజంలో పోషణపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని చెప్పారు. ఐసిడిఎస్ లబ్ధిదారులైన గర్భిణీ స్త్రీల పోషణ స్థితిని మెరుగుపరిచినట్లయితే మన భావితరాల పిల్లలు ఆరోగ్యంగా జన్మనివ్వడం జరుగుతుంది అన్నారు. భావితరాలు పోషణ లోపం లేకుండా ఆరోగ్యవంతమైన తెలంగాణ ఏర్పడుతుందన్నారు.ఒక కుటుంబం,గ్రామం ఆరోగ్యంగా ముందుకు వెళ్లాలంటే కుటుంబంలో మహిళల పాత్ర ప్రత్యేకమని అన్నారు. అనంతరం ఆరు నెలలు పూర్తయిన పిల్లలకు అన్న ప్రాసనలు, అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్యకి నమోదైన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి, చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు స్వరూప, పుట్టినరోజు కావడంతో శాలువాతో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణ, సూపర్వైజర్లు కైర్ రున్నీసా బేగం, మంగ, అనురాధ, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.