03-01-2026 12:00:00 AM
బోథ్ అటవీ రేంజ్‌లో పరిశీలన
బోథ్, జనవరి 2 (విజయక్రాంతి) : బాసర సర్కిల్ చీఫ్ కన్సర్వేటర్ శరవాణాన్ ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్‌తో కలిసి బోథ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా శాఖ పరం గా చేపట్టిన పనులను ఆయన పర్యవేక్షించారు. వాటికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.
ఈ సంవత్సరం నాటిన అవెన్యూ ప్లాంటేషనలను, వాటికి సంబందించిన రికార్డులను పరిశీలించారు. అనం తరం పెద్దపులి సంచరిస్తున్న అటవీ ప్రాం తాల్లో కలియతిరిగారు. గతంలో ఎన్ని సార్లు ఈ అటవి ప్రాంతంలో కనిపించిన పులుల విషయంపై ఆరా తీశారు. ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ అటవీ అధికారి ప్రణయ్, అటవీ సిబ్బంది ఉన్నారు.