calender_icon.png 20 October, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసూళ్లలో ముఖ్యమంత్రి టాప్

20-10-2025 01:49:00 AM

ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయ క్రాం తి): ‘సీఎం రేవంత్ రెడ్డి వసూళ్లలో టాప్ ఉన్నారు. వసూళ్ల దర్బార్ నడిపిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ఉదంతమే దీనికి ఉదాహరణ. సీఎం రేవంత్‌రెడ్డి తన చుట్టూ తమ్ముళ్లను, చెంచాలను పెట్టుకున్నారు. వసూ ళ్లలో రెండోస్థానంలో పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి, మూడోస్థానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. ‘మేమేం తక్కువా’ అని మిగిలిన మంత్రులూ పోటీపడుతున్నారు’ అని  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపిం చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణను కేసీ ఆర్ అగ్రగామిగా నిలిపారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గన్నులతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. వసూళ్ల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు పోటీ పడుతు న్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రజలు గోపీనాథ్ రుణం తీర్చుకుంటారన్నారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ అట్టర్ ప్లాఫ్ అయిందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ఉపఎన్నికల స్పెషలిస్ట్ అని కేపీ వివేకానంద గుర్తు చేశారు.