calender_icon.png 20 October, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ బరిలో ఉద్యమకారుల ఫోరం

20-10-2025 01:42:30 AM

ముషీరాబాద్, అక్టోబర్ 19 (వికాయక్రాంతి): అన్ని రాజకీయ పార్టీలకు ఉధ్యమకారుల ఆవేదనను తెలియజేయడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉధ్యమకారుల ఫోరం తరపున సీనియర్ ఉధ్యమ కారుడు బందెల ఇందర్ కుమార్ ను బరిలో నిలుపుతున్నట్లు ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా స్వామి స్పష్టం చేశారు. ఈనెల 21న భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు.

ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రేటర్ అధ్యక్షుడు గుండు దయానంద్, కన్వీనర్ జగన్ యాదవ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ కొంతం యాదిరెడ్డి, రాష్ట్ర నాయకులు తాడూరి గగన్ కుమార్, వీరస్వామి, విష్ణువర్ధన్, జానకిరెడ్డి, నరేందర్ గౌడ్ లతో కలసి ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని వారు ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాన ఉధ్యమకారులను పూర్తిగా విస్మరించాయని, ఉధ్యమమంలో పాల్గొనని వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శివ కుమార్, రాజేందర్, భాను ప్రకాష్ రెడ్డి, నస్రీన్, మాణిక్యం, మోహన్ చారి, జగన్ తదితరులు పాల్గొన్నారు.