15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజలకు గొప్ప వరం

10-06-2025 12:00 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కోనరావుపేట, జూన్ 9 (విజయక్రాంతి) ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజలకు గొప్ప వరమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అర్హులైన 56 మంది లబ్ధదారులకు 18 లక్షల 37 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను  రా ష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు.వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు.

మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార, ఎల్‌ఓసి ల ద్వారా ఇప్పటి వరకు 20 కొట్లు పై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని  తెలిపారు.

గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 10 సంవత్సరాలలో 400 కోట్లు పంపిణీ చేస్తే ప్రజా ప్రభుత్వ ఏర్పడిన నాటినుండి నేటి వరకు 800 కోట్ల మేర లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది అన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాదు మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చాకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్  తాళ్లపల్లి ప్రభాకర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహనరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిచేపూరి గంగాధర్, మాజీ జెడ్పిటిసి గొట్టె రుక్మిణి, మనుక సత్యం, చారి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.