17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సొగసు చూడ తరమా...

10-06-2025 12:00 AM
  1. రైల్వే గేట్ వద్ద ప్రమాదకరంగా ప్రధాన రహదారి 
  2. జిల్లా కేంద్రాల మధ్య రాష్ట్రీయ రహదారిపై దుస్థితి 

జగిత్యాల, జూన్ 9 (విజయక్రాంతి): జగిత్యాల - కరీంనగ ర్ ప్రధాన రహదారిపై రైల్వే గేటు వద్ద రోడ్డును చూసిన వారు వ్యంగ్యంగా అంటున్న మాటలివి. అసలే రోడ్డుకు అడ్డంగా రై లు పట్టాలు.. రైల్వే గేటుకు ఇరు వైపులా పెద్ద పెద్ద స్పీడ్ బ్రే కర్లు.. పైపెచ్చు ఈ రోడ్డంతా పెద్దపెద్ద గుంతల మయం... వెరసి ఈ రోడ్డును చూసిన వారు ’సొగసు చూడ తరమా...’ అనక తప్పడం లేదు మరి.

రెండు ముఖ్యమైన జిల్లా కేంద్రాల మధ్య ఉన్న రాష్ట్రీయ రహదారి ఇది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెళ్లాలన్నా తప్పకుండా ఈ రోడ్డుపై వెళ్లాల్సిందే.   జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్లే రాష్ట్రీయ రహదారిపై కొండగట్టు దాటి వెళుతుండగా,కాశిరెడ్డిపల్లె దాటగానే రైల్వే గేటు ఉంది. అప్పటి వరకు ఇరుకైన రోడ్డుపై కొండగట్టు వద్ద ఉన్న అనేక ప్రమా దకర మలుపులు దాటి ప్రయాణించడం ఒక ఎత్తు.

అయితే ఈ రైల్వే గేట్ రాగానే దాదాపు మూరెడు లోతు గల పెద్ద పెద్ద గుంతలతో ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం మరో ఎత్తు. చిన్న చిన్న వాహనాల వారైతే ఈ రైల్వే బ్రిడ్జి దాటే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనం నడపాలి అనడం అతిశయోక్తి కాదు. ప్రతి రోజూ వేలాది భారీ, మధ్య తరహా వాహనాల రాకపోకలతో విపరీతమైన ట్రాఫిక్’తో ప్రయాణం ఇబ్బందిక రంగా ఉన్న ఈ జగిత్యాల - కరీంనగర్ రహదారిపై రైల్వే గేటు దాటడం గగనంగా మారింది.

దాంతో ఈ రోడ్డుపై ప్రయాణిం చాలంటేనే ఈ ప్రాంత వాసులు బెంబేలెత్తుతున్నారు. అను నిత్యం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, చొ ప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు తమ పనుల నిమిత్తం ప్రతిరోజూ ఈ రహదారిపై ప్రయాణిస్తుంటా రు. ఒకవేళ వరంగల్ జిల్లాకు వెళ్లాలన్నా ఈ రోడ్డుపైనే కరీం నగర్ మీదుగా ప్రయాణించాల్సిందే. అంతేకాక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లాలనుకున్నా ఈ కరీంనగర్ రోడ్డే దిక్కు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుండి తీస్తున్న ’గ్రానైట్’ ఇతర రాష్ట్రాలకు తరలించేది కూడా ఈ రహదారి మీదుగానే. అయితే పెద్ద పెద్ద కొండ రాళ్లతో కూడిన భారీ వాహనాలు అస్తమానం ప్రయాణించడం మూలంగానే రోడ్డు చెడిపోయి, రైల్వే గేట్ వద్ద అంతంత పెద్ద గుంటలు ఏ ర్పడ్డాయనేది స్థానికుల వాదన. ప్రతిరోజు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తమ అవసరాల నిమిత్తం ఈ రోడ్డుపైనే ప్రయాణిస్తారు.

ఇంతటి వాహన రాకపోకలున్న జగిత్యాల - కరీంనగర్ రహదారిపై కొండగట్టు, పూడూరు మ ధ్యలో ఉన్న ఈ రైల్వే గేట్ వద్ద ప్రమాదకరంగా మారిన రోడ్డు ను ఏళ్లు గడిచినప్పటికీ పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటి కైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఉన్న ఈ రోడ్డు మరమ్మతుకు తక్షణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది.