23-04-2025 12:00:15 PM
మంథని,(విజయక్రాంతి): మంథని మండల పరిధిలోని కన్నాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో శ్రీశ్రీశ్రీ కృష్ణ భగవానుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సోదరుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి నీ దర్శించుకుని ఈ ప్రాంత ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో కలకాలం ఉండాలని అ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్, మంథని తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రూ రమా-సురేష్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, మంథని మండల యూత్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.