calender_icon.png 25 November, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది

11-02-2025 12:06:44 AM

  1. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఏ ఒక్క హామీ అమలు చేయలే 
  2. బీఆర్‌ఎస్ పార్టీ అబ్దుల్లాపూర్ మెట్ మండల విస్తృత స్థాయి సమావేశంలో 
  3. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 10:  అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిందని బీఆర్‌ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం మండల కేంద్రంలో వైఎన్‌ఆర్‌గార్డెన్‌లో నిర్వహించారు.

ఈ సమావేశానికి మండల అధ్యక్షుడు కొత్త కిషన్ గౌడ్ అధ్యక్షతన వహించాడు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అబద్ధ హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి... అధోపతి పట్టించారని ఎద్దేవా చేశారు.  రాష్ట్రంలో  అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కుది లైందన్నారు. రియల్ ఎస్టేట్స్ రంగంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం తప్ప .. మరెవ్వరు లేర న్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి ముందుండేదన్నారు.  ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.  అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దోచుకునుడు.. దాచుకోనే మీద ఉన్న శ్రద్ద నియోజకవర్గ అభివృద్ధి మీద లేదన్నారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను కూడా ముప్పు తిప్పలు పెడు తున్నాడని విమర్శించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత బీఆర్‌ఎస్ కలిసి వస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ గెలుపుకోసం కార్యకర్త నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ  కలిసికట్టుగా.. పనిచేసే ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు క్యామ మల్లేష్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు శిఖ సాయికుమార్, చెరుకు కిరణ్ గౌడ్, మదన్ వీరస్వామి యాదవ్, మహేందర్, పూజా చక్రవర్తి గౌడ్, ధనంజయ గౌడ్,  లెక్కల విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.