05-11-2025 12:00:00 AM
ఊబకాయం పెద్దల్లోనే కాదు పిల్లల్లోనూ సమస్యగా మారిపోతున్నది. మారుతున్న జీవన శైలి,ఆహార విధానాలతో దేశంలో ఊబకాయుల సం ఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. హైదరాబాద్‌లో ప్రతీ ముగ్గురు పిల్లల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నట్లు ఆరోగ్య శాఖ అధ్యయనంలో తేలింది. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఆవలంబిస్తున్న విధానాలే ఇవా ళ వారిలో ఊబకాయం పెరగడానికి కారణంగా మారుతుందని పేర్కొన్నారు.
గత దశాబ్ద కాలంగా పిల్లల్లో ఊబకాయంతో పాటు అధిక రక్తపోటు, కొవ్వు, టైప్ డయాబెటిస్ కేసులు ఎక్కువగా నమోదవుతూ వస్తున్నా యి. 5 నుంచి 19 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న పిల్లలు తీసుకుంటున్న ఆ హార పదార్థాల్లో పోషకాలు తక్కువగా ఉండి ఎనర్జీ కేలరీలు మోతాదుకు మించి ఉంటున్నాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, క్రీడలకు దూరంగా ఉండటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తిన డం, స్మార్ట్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడం లాంటి కారణాల వల్ల పిల్ల ల్లో ఊబకాయం పెరుగుతుందని ని పుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకప్పు డు అధిక పోషకాహార లోపానికి పేరుగాంచిన భారత్ ఇప్పుడు ఊబకాయం ఉన్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కిమ్స్ చీఫ్, నియోనాటాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ బాబు ఎస్ మదార్కర్ పేర్కొన్నారు. తమ అధ్యయనం ప్రకారం, దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారని, ముఖ్యంగా నగరాలు, పట్టణ జనాభాలోని పిల్లల్లో ఊబకాయం తీవ్రత ఎక్కువగా ఉందన్నారు.
అయితే పిల్లల్లో ఊబకాయం తగ్గించేందుకు కేవలం శారీరక శ్రమ మాత్రమే సరిపోదని, వాళ్లు తీసుకునే ఆహార పదార్థాల్లో పోషకాలు, కేలరీలు ఎంత ఉంటాయనేది స్కూళ్లో టీచర్లు, ఇండ్లలో తల్లిదండ్రులు సున్నితంగా వివరించాల్సిన అవసరముంది. జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాలను, ఏర్పడే ఆరోగ్య సమస్య లను పిల్లలకు ప్రాక్టికల్‌గా చూపిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు.
పసి వయసులోనే స్థూలకాయం, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అపోలో ఆసుపత్రి సీనియర్ డాక్టర్, ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఎరుకులపాటి పేర్కొన్నారు. తరచూ ఆయిల్ ఫుడ్, అసమతుల్య ఆహారం, తగినంత నిద్ర లేకపోవడం, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందన్నారు.
పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ధోరణిలో మార్పు రావాల్సిన అవసరముంది. ఇప్పటి పేరెంటింగ్ విధానంలో అర్థరాత్రి దాటినా పిల్లలు పడుకోకపోవడం, బిర్యానీలు, జంక్ ఫుడ్, స్నాక్స్ లాంటి ఆహార పదార్థాలను ఆన్‌లైన్‌లో బుక్ చేసి వారికి తినపించడం లాంటివి చేస్తున్నారు. ఇవన్నీ పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపేవే అని, ఒక రకంగా తల్లిదండ్రులే పిల్లల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారని రవిశంకర్ తెలిపారు.
ఊబకాయాన్ని పిల్లలకు ఎలా ఆపాలో తెలియదు కా బట్టి ఈ విషయంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉం దని రెయిన్ బో చిల్డ్రన్స్ ఆసుపత్రి పీడియాట్రిషియన్ డాక్టర్ నంద కిషోర్ వెల్లడించారు. ఇప్పటికైనా పిల్లల్లో పెరిగిపోతున్న ఊబకాయం సమస్యపై తల్లిదండ్రులే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలకు శారీరక శ్రమ కల్పిం చడం తో పాటు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉంచడం, వేళకు నిద్రపోయేలా చేయ డం, జంక్ ఫుడ్ తగ్గించడం చేస్తే ఊబకాయం దూరమవ్వడం ఖాయం.
శెగ్గారి వరుణ్, 9912864973