05-11-2025 12:00:00 AM
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కర్నూల్ స్లీపర్ బస్సు అగ్నిప్రమాదం ఘటన మరువక ముందే మృత్యుశకటంలా దూసుకొచ్చిన టిప్పర్ అతివేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది విగతజీవులుగా మారడం అందరినీ కలచివేసింది.
పేరుకు జాతీయ రహదారి అయినప్పటికీ రోడ్లపై ఎక్కడపడితే అక్కడ గుంతలు ఉండడం ఘోర ప్రమాదానికి కారణమయ్యింది. అయితే ప్రమాదం జరగడానికి రోడ్లు బాగు చేయని అధికా రు లను మాత్రమే నిందిస్తే సరిపోదు. టిప్పర్‌లో కంకర ఓవర్ లోడ్‌కు అనుమతులిచ్చిన అధికారులను, అధిక ఆదాయం కోసం పరిమితికి మించి ప్ర యాణికులను ఆర్టీసీ బస్సుల్లోకి ఎక్కించి వారిని మృత్యుకూపంలోకి నెట్టేస్తు న్న ఆర్టీసీని కూడా దోషులుగా పరిగణించాల్సిందే.
నేషనల్ హైవే విస్తరణ పనుల ప్రారంభంలో జాప్యం జరగడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ కేసు కారణమని జాతీయ రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ ప దేళ్ల క్రితమే రహదారిని విస్తరించాలనుకున్నప్పుడు భారీ మర్రి వృక్షాలు ఉ న్న సంగతి అధికారులకు తెలిసి కూడా వాటి మధ్యనే రహదారిని నిర్మించా రు. చెట్లను నేలకూల్చకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి రహదారి డిజైన్‌ను మార్చి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవి కాదేమో.
తెలంగాణ ఏర్పడిన 11 ఏళ్ల నుంచి చూసుకున్నా ఈ రహదారిపై జరిగిన ప్ర మాదాల్లో 300 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిర్వహణ లోపాలతో పలుచోట్ల రహదారులపై గుంతలు ఏ ర్పడుతున్నాయి. వేగంగా వెళ్తున్న వాహనదారులు గుంతలు కనిపించగానే వాహనాన్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ సమయంలో వాహన వేగాన్ని తగ్గించకపోవడం, ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహన డ్రైవర్ల నిర్ల క్ష్యం, అతివేగం కూడా ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
2024లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 84 శాతం అధిక వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2014 నుంచి 2025 జూలై వరకు రాష్ట్రవ్యాప్తంగా 2.57 లక్షల ప్రమాదాలు జరిగితే దాదాపు 87 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చేవేళ్ల ప్రమాదం రోజునే రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక టిప్పర్ అధిక వేగంతో పలు వాహనాలను ఢీకొట్ట డంతో 14 మంది మరణించారు.
ప్రమాదాలు జరిగినప్పుడల్లా పాలకులు విచారం వ్యక్తం చేస్తూ నష్ట పరిహారాలు ప్రకటిస్తున్నారు. కానీ వాహనాల వేగం నియంత్రణ కోసం అధికారులు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది ఆలోచించాల్సిన అంశం. ఇప్పుడొస్తున్న వాహనాల డిజైన్లన్నీ విదేశీ దేశాల రోడ్లను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నారు. కానీ మన దేశంలో విశాలమైన రోడ్ల కంటే ఇరుకైన రోడ్లే ఎక్కువగా ఉన్నాయి.
జాతీయ రహదా రులున్నా ఎప్పుడూ రిపేర్ల పేరుతో డైవర్షన్లు ఎక్కువగా పెడుతుండడంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై లారీలు, టిప్పర్‌లు బండరాళ్లు, కంకర, ఇటుకలను ఓవర్‌లోడ్‌తో మోసుకెళ్లడమే గాక అధి క వేగంతో దూసుకొస్తూ మృత్యు శకటాలుగా మారుతున్నాయి. కనీసం వా హనాల ఓవర్‌లోడ్, అధిక వేగాన్ని నియంత్రించేందుకు రవాణా శాఖ కఠిన నిబంధనలు తీసుకొస్తే ప్రమాదాలను కొంతైనా నివారించొచ్చు