calender_icon.png 6 November, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల గౌర వప్రద వేతనాలు

05-11-2025 12:00:00 AM

దుర్గజనపదశక్త్యా భృత్యకర్మ 

సముదయ పాదేన స్థాపయేత్..

(కౌటిలీయం 5) రాజ్యం ఆర్థిక శక్తిని బట్టి మొత్తం ధనాదాయంలో ఉద్యోగుల వేతనాలు నాలుగవ వంతు ఉండేట్లుగాని, ఉద్యోగులు వారి పనులను గౌరవప్రదం గా నిర్వహించుకునేట్లుగాని నిర్ణయించాలి. ఆదాయాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుం టూ.. ధర్మానికి, అర్థానికి లోటు రానీయకూడదు, అంటాడు, ఆచార్య చాణక్య. ఆ నాటి జీవన విధానానికి సరిపోయే వి ధం గా ఎవరికి ఎంత వేతనం చెల్లించాలో చాణక్య సూచించాడు. అంతేకాదు శాశ్వత ఉ ద్యోగులకు, తాత్కాలిక ఉద్యోగులకు వా రి వారి విద్యార్హతలను, చేసే పనిని, నైపుణ్యాలను బట్టి వేతనాల్లోనూ, బత్తెంలోనూ విశే షాన్ని కనబరుస్తుండాలని అంటారాయన.

ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాలు వారికి న్యాయబద్ధంగా, పరిశ్రమల స్థాయి కి త గిన విధంగా జీవన ప్రమాణాలకు అ నుగుణంగా, సంస్థకు భారం కాకుండా, ఉ ద్యోగులకు ప్రేరణ కలిగే విధంగా ఉండా లి. ముఖ్యంగా శిక్షణ పొందిన ఉద్యోగులు సంస్థను వీడకుండా ఉండే విధంగానూ, ఉద్యోగుల కుటుంబసభ్యుల ప్రగతికి అవసరమైన ఆర్థిక స్థోమతను అందించే వి ధంగా వేతనాలు నిర్ణయింపబడాలి.

అలాగని కోశాగారంపై వేతనాలు భారంగా పరిణమించరాదు. వ్యాపార లావాదేవీల్లో సా ధించిన మొత్తం ఆదాయంలో వేతనాల ని ష్పత్తిని ఎంతగా తగ్గించుకోగలిగితే సంస్థ ఆర్థిక పరిస్థితి అంతగా శోభిస్తుంది. అయితే నేడు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు.. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగభృతిని ఇస్తామని.. ఆచరణలో సాధ్యం కాని, అలవికాని హామీలు ఇస్తున్నాయి. ఉద్యోగుల వేతనాలైనా, ఆదాయానికి మించిన ఖర్చులైనా; కోశంపై భారాన్ని పెంచితే.. మౌలిక వసతుల కల్పన జరగదు, అభివృద్ధి సాధ్యపడదు. అది అ రాజకానికి, ప్రజల ఆగ్రహావేశాలకు దారితీస్తుంది.

జయాపజయాలు

నాయకుడెంత సమర్ధుడైనా అన్ని కా ర్యాలనూ తానొక్కడే నిర్వహించుకోలేడు. ఉద్యోగుల సహకారం అవసరం. వారితో ఏర్పరుచుకునే సంబంధాలే నాయకుని జయాపజయాలకు కారణమౌతాయి. మా నవ వనరులు, ముడి సరుకులు, యంత్ర సామగ్రి, ప్రక్రియలు, ఆర్థిక వనరులు వీటి కి తోడుగా నైతికత కలిగిన సంస్థలో నాయకునికి, ఉద్యోగులకు మధ్య భౌతిక వల యంలో ఫలితాలు కనిపిస్తాయి.

భావోద్వేగాల వలయంలో సంబంధాలు బలీయ మవుతాయి. ఆలోచనా వలయంలో అవగాహనలు పటిష్టమవుతాయి. ఉద్యోగులు, నాయకుడు ఏకోన్ముఖులైతే రాజ్యాలు లే దా సంస్థలు అభ్యుదయాన్ని సాధిస్తా యి. ఈ క్రమంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు.. ఉద్యోగులను అవసరానుగు ణంగా మాత్రమే నియమించుకోవడం, ప్రాముఖ్యత లేని విభాగాల్లో పనులను ఇతర సంస్థలకు అప్పగించి ఉత్పత్తుల నా ణ్యతను పరీక్షించుకోవడం, వివిధ విభాగాల్లో పనిచేసే విధంగా ఉద్యోగులకు అవ సరమైన శిక్షణ ఇప్పించడం,

సాంకేతికతను ఉపయోగించుకొని నిర్వహణ సమయా న్ని తగ్గించుకోవడం లాంటి చర్యల వల్ల తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని ని నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం ఆదాయంలో సేవల విభాగంలో అత్యధికంగా 60 శాతం, ఉత్పత్తి విభాగం లో 35 శాతం వరకు వేతనాల రూపంలో ఖర్చు చేయడం వల్ల సంస్థలపై అధిక భా రం పడకుండా ఉంటుంది.

ఉద్యోగులకు కాలావధిలో శిక్షణను అందించడం వల్ల ఆధునిక సాంకేతిక విజ్ఞానం వారికి అందుబాటులో ఉండడమే గాక కొత్తదనాన్ని ఆ స్వాదించడంలో ఉత్సాహమూ ఉంటుం ది. అయితే విద్యార్థికన్నా గురువుకు అధిక విజ్ఞానం ఉండాలి. అలాగే నాయకుడు అ నుచరుల కన్నా అధికంగా నేర్వాలి. ఎవరికి వారే తమ ఉన్నతికి పాటు పడాలి. 

ఆర్థిక అభివృద్ధి

కోశాన్ని పటిష్టంగా నిలుపుకునేందుకు అందుబాటులో ఉన్న మానవ వనరులను, వస్తుగత వనరులను, సాంకేతిక వన రులను, ఆర్థిక వనరులను ప్రభావవంతం గా ఉపయోగించుకోవాలి. దానితో ఉత్పాదకత పెరగడం, నాణ్యతా ప్రమాణాల అ భివృద్ధి, ప్రభావశీలతలో వృద్ధి, వృధా వ్య యాల నియంత్రణ సాధ్యపడుతుంది. దా నితో సంస్థ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుం ది.

అయితే అందుబాటులో ఉన్న వనరులను వృధా చేయకుండా, ప్రాధాన్యతా క్ర మంలో, అత్యున్నత స్థాయిలో ఉపయోగించుకోవడమే ప్రభావశీలత. సరైన పని లో, సరైన విభాగాల్లో అవసరమైనన్ని వనరులను కేటాయించడం వల్ల నాణ్యతా ప్ర మాణాలతో ఉత్పాదకత పెరుగుతుంది.. ఉ త్పత్తివ్యయమూ తగ్గుతుంది. అయితే వనరుల లభ్యత సరిగా లేకపోతే.. కొన్ని సమ స్యలు రావచ్చు.

వాటిని అధిగమించి లక్షిత లక్ష్యాన్ని చేరడమే నాయకుని దక్షతకు పరీక్షగా చెప్పుకోవచ్చు. నాయకుని ప్రయాణం లో ప్రలోభాలు, అడ్డంకులూ పలకరించవచ్చు. వాటిని అధిగమించగలిగిన ధైర్యం, నేర్పు కలిగిన నాయకుడు ఏనాడూ ఓటమిని పొందడు. సమయం, బడ్జెట్టు, సౌక ర్యాలు, ఆర్థిక, మానవ వనరులు, సంస్థ పరపతి.. ఇవన్నీ సంస్థ జయాపజయాల ను నిర్ణయించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి.

సంస్థ ఆర్థికంగా బలోపేతమైతే ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయి. దానితో వారి జీవితాలు వెలుగుచూస్తా యి. ఈ క్రమంలో సంతృప్తి చెందిన ఉద్యోగులు సంస్థకు విధేయులై ఉంటారు. ఉ ద్యోగుల అంకితభావం వల్ల వినియోగదారునికి సంతృప్తికరమైన సేవలు అందుతా యి. తగ్గిన ఉత్పత్తి వ్యయం, వినియోగదారుల సంతృప్తి, ఉద్యోగుల భాగస్వామ్యం సంస్థ ఆదాయాన్ని పెంచుతుంది.

అడ్డంకులు అధిగమించి

సృజనాత్మక ఆలోచనలు, నిరంతర పరిశోధన, వాస్తవిక పరిస్థితుల విశ్లేషణ స మస్యల పరిష్కారాలకు ముఖద్వారం వం టిది. సృజనాత్మక ఆలోచనలు లాభాలను అందించాలి. అయితే సృజనాత్మకత విజయవంతం కావాలంటే అపారమైన సహ నం కావాలి. ‘నేను చెప్పిన విధంగా చేయి’ అనే నాయకుని వద్ద సృజనాత్మకత కలిగిన ఉద్యోగులు తమ శక్తి సామర్ధ్యాలు పూర్తిగా వినియోగించలేరు.

నాయకునికి సహాయంగా నిలిచిన ఉద్యోగుల ‘చేతుల తో వారి బుద్ధి జతకడితే..’ సంస్థకదొక ఆ స్తిగా పరిణమిస్తుంది. చిన్న బృందాలు, వే గవంతమైన వారి ఆలోచనలు, వ్యూహాత్మకమైన కదలికలు.. ఈ మూడూ ప్రభావ వంతమైన ఫలితాలను ఆవిష్కరిస్తాయి. రా మాయణంలో హనుమంతుడు సీతను అన్వేషించే కార్యంలో ఎదురైన ప్రలోభాలను, అడ్డంకులను అధిగమించి వి జయా న్ని సాధించాడు.

భారతంలో అపారమైన సైన్యం.. ఉత్తమయోధులైన సేనాపతులు సమకూరినా, సమర్ధవంతంగా వారిని వినియోగించుకోలేక దుర్యోధనుడు పరాజి తుడయ్యాడు. కాబట్టి ఉన్న వనరులను స మర్ధంగా  ఉపయోగించుకొని, ఉద్యోగుల సహకారంతో విజయాన్ని సాధించే నా యకుడే ఉత్తముడవుతాడు.