03-08-2024 12:05:00 AM
బాలలు జాతీయ సంపద, భవిష్యత్తు మానవ వనరులు. వారి శ్రేయస్సు దేశాభివృద్ధికి మూలం. అందుకే ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు పెద్దలు. బాలల సంక్షేమం, అభివృద్ధిపై పెట్టుబడి దేశాభివృద్ధికి సూచిక. బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతిబిడ్డ జన్మ హక్కు .సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలంటే బాల్యం కీలకమైంది.పిల్లల మనసులు చాలా సున్నితమై నవి. బాల్యంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలు వారి భావి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మానసిక శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల్లో పేర్కొన్నారు.
ఇంటిలో, బడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు పెరగడానికి కావలసిన పరిస్థితులు కల్పించి వనరులు సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వాలు, సమాజం పై ఉంటుంది. కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, విద్యావ్య వస్థ తీవ్ర ప్రభావానికి గురైనాయి. మూతబడిన స్కూల్స్, ఊడిన ఉద్యోగాలు, స్తంభిం చిన ప్రజాజీవనం, నిరుద్యోగం, తగ్గిన ఆదా యం పిల్లల జీవితాలను ప్రభావితం చేశా యి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మధ్య తరగతి, పేద బాలలు కనీస సౌకర్యాలు లేక, ప్రాథమిక అవసరాలు తీర్చుకో లేని కటిక దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారని ఇటీవల ‘యూనిసెఫ్’ నివేదిక పేర్కొంది.
మారని బాలల దుస్థితి
యూనిసెఫ్ అధ్యయనం ప్రకారం కోవిడ్ కారణంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలో కనీస అవసరాలయిన విద్య, వైద్య, ఆరోగ్య, గృహ వసతి, పోషకాహారం, పారిశుద్ధ్యం, తాగు నీరు అందుబాటులో లేని బాలల సంఖ్య 125 కోట్లు ఉండగా వీరికి అదనంగా మరో15 కోట్ల మంది చేరారు. ఈ పరిస్థితులు పేదరికం పెరగడానికి దారితీసింది. భారత దేశంలో 30 శాతానికి పైగా బాలలు కటిక పేదరికంలో ఉన్నారని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన గణనీయమైన అభివృద్ధి వల్ల పేదరికం తగ్గినప్పటికీ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న కుటుంబాలలో బాలలు పేదరికాన్ని అనుభవిస్తుండం శోచనీయం.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో 1981లో పేదలుగా ఉన్న వారు 2010 నాటికి కూడా పేదలుగానే వున్నారని తేలింది. పేదరికం, నిరుద్యోగం బాలకార్మికల సం ఖ్య పెరగడానికి దోహదపడిందని ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త కౌశిక్ బసు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే 30 శాతం పైగా అత్యంత పేదరికంలో నివసించే బాలలు మనదేశంలోనే ఉండడం గమనార్హం.‘ఎండింగ్ ఎక్స్‌ట్ట్రీమ్ పావర్టీ ఫోకస్ ఆన్ చిల్డ్రన్’ నివేదిక ప్రకారం పేదరికంలో నివసించే పెద్దలకంటే బాలలు రెండు రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉం దని తేలింది. జనాభాలో మూడో వంతు ఉన్న బాలల్లో సగం మంది పేదరికంలో ఉన్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.
2013 నాటికి అభివృద్ధి చెందు తున్న దేశాలలో తలసరి ఆదాయం 1.90 డాలర్లు సంపాదిస్తున్న కుటుంబాలలో 19.5 శాతం బాలలు పేదరికంలో వున్నట్లు తేలింది.7 దశాబ్దాల స్వతంత్ర భారతం సాధించిన అభివృద్ధి ఫలాలు దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీ, ఎస్టీ, పేద బడుగు బలహీన వర్గాలకు అందక పోవటం వల్ల ఈ వర్గాల్లో 80శాతం బాల లు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అభివృద్ధిచెందిన దేశాలలో ఐదేళ్ల లోపు బాలల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు అత్యంత పేదరిక కుటుంబాలలో నివసిస్తున్నారు.
అంతులేని కరోనా ప్రభావం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విసిరిన పంజాకు సామాజిక,ఆర్థిక, విద్య, వైద్య రంగాలు కుదేలయ్యాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. ఉద్యోగం లేక అనేక కుటుంబాల ఆదాయాలు తగ్గాయి. ఈ ప్రభావం బాలల మీద పడింది. విద్య, వైద్య, ఆరోగ్య సౌకర్యాలు, ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేని స్థితిలో బాలలు కూరుకు పోవటంవల్ల వారి శారీరక, మానసిక వికాసం కుంటుపడింది. కరోనా వల్ల బాలల్లో లింగపరమైన అసమానతలు, విద్యాపరమైన అంతరాలు పెరిగాయి. బాలల జీవనంపై కరోనా మహమ్మారి ప్రభావంపై ఇటీవల ‘సేవ్ ది చిల్డ్రన్’అనే సంస్థ ప్రత్యేక అధ్యయనాలు చేసింది.
కరోనా వల్ల 93 శాతం కుటుంబాలు సగానికి పైగా ఆదాయం కోల్పోవడంతోఆరోగ్య సేవలు పొందలేదని, 62 శాతం కుటుంబాలు బాలలకు పౌష్టికాహారం అందించలే క పోయాయని,37 శాతం పేద కుటుంబాల బాలలు చదువు కోవడానికిఅభ్యసన పరికరాలను కొనలేక పోయారని సర్వేలో తేలింది. లాక్‌డౌన్ వల్ల స్కూల్స్ మూతబడ్డాయి. ఆన్‌లైన్ బోధన వల్ల, టీచర్స్ పర్యవేక్షణ లేకపోవడంతో ప్రతి 10 మందిలో 8 మంది బాలలు ఏమీ నేర్చుకోలేదని, గృహ హింస పెరిగిందని, బాలికలపై పని భారం, ఒత్తిడి పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతిని ప్రతికూల భావనలు పెరిగాయని సర్వే పేర్కొంది.
విద్యారంగంలో అత్యవసర పరిస్థితిని పాటించడం వల్ల ఈ సంవత్సరం దాదాపు కోటి మంది పిల్లలు స్కూల్స్‌కు తిరిగి రాక పోవచ్చునన్న అంచనాలు తీవ్ర ఆందోళన కలిగిస్తు న్నది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం భారత దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం వల్ల1.2 కోట్ల మంది దారిద్య్ర రేఖ దిగువకు చేరే అవకాశం ఉందని పేర్కొనడం బాలల భద్రతకు పెను సవాలుగా పరిణమించింది.
ప్రభుత్వాల బాధ్యత
బాలల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వాలు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చెయ్యాలి.బాలల కనీస అవసరాలు తీర్చి వారి వికాసానికి కృషి చేయడం ప్రభుత్వాల బాధ్యత. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల రక్షణ కోసం 1989 నాటి అంతర్జాతీయ ఒడంబడికను ప్రపంచ దేశాలు క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలుచేయాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ, మాతా శిశు సంక్షేమ పథకాలు,ఇమ్యునైజెషన్, పరిశుభ్రమైన నీరు, పౌష్ఠికాహార పంపిణీ,ప్రాథమిక వసతులు ఏర్పాటుచేయాలి.ప్రభుత్వాలు పేదవర్గాలకు మాజిక రక్షణ పథకాలు రూపొందించాలి.
పేదవర్గాలకు ఉచిత విద్య,వైద్యం, తాగునీటి సౌకర్యం, గృహవసతి, ఆరోగ్య సంరక్ష ణ వంటి మౌలిక వసతులు మెరుగు పరచాలి. బాలల సర్వతోమఖాభివృద్ధి లక్ష్యం గా ప్రయోజనకరమైన ఆర్థికవృద్ధిని పెంచే బహుముఖ అభివృద్ధి వ్యూహాన్ని అమలు చెయ్యాలి. ప్రాథమిక నిర్బంధ విద్యా హక్కును అమలుచేయడంలో ప్రభుత్వ యంత్రాంగం ముఖ్య పాత్ర పోషించాలి. గ్రామీణ ప్రాంతాల్లో,నగరాల్లోని మురికి వాడల్లో నివసించే పేదలను అక్షరాస్యులను చేయాలి.ఉపాధి అవకాశాల కల్పన, విస్తరణ, పేదరిక నిర్మూలన, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, ఆదాయ సృష్టి, పంపిణీ ఏకకాలంలో జరిగే విధంగా ప్రభుత్వాల పాలనాయంత్రాంగం చర్యలు చేపట్టాలి.
మనదేశంలో ప్రభుత్వం పేదరికం,నిరుద్యో గం, ఆర్థిక, అసమానతలు, ఆకలి చావులు, లింగ వివక్ష సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. బాలల్లో పౌష్ఠికా హారం కొరతను అధిగమించేందుకు మధ్యాన్న భోజనం, ఉచిత ఆరోగ్య సంరక్షణ పరీక్షలు, విటమిన్ టాబ్లెట్లు ఉచితంగా అందించాలి. బాలల హక్కుల రక్షణలో పౌరసమాజం, స్వచ్ఛం ద సంస్థలు క్రియాశీలక పాత్ర పోషించాలి.
రాజ్యాంగం బాలల హక్కుల రక్షణ
మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక మంత్రిత్వ శాఖ సమిష్టిగా బాలల అభివృద్ధి, సంక్షేమ చట్టాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి. పేద వర్గాల ప్రజలను సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రణాళి కలో భాగస్వాములను చేయాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం అన్ని రకాల బలవంతపు వెట్టి చాకిరీ, ప్రమాదకరమైన గనుల్లో ్ల బాలల చేత పని చేయించడం నిషేధాన్ని అమలు చేసి, ఆర్టికల్ 39 ప్రకా రం బాలలకు స్వేచ్ఛ,గౌరవం ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలలకు ఎదిగే అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.బాలల అభివృద్ధే దేశాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాలు సమగ్రమైన అభివృద్ధివ్యూహలతో బాలలకు బంగారు భవితను కల్పించాలి.
వ్యాసకర్త సెల్: 9440245771