31-01-2026 12:07:14 AM
ఇల్లందు, జనవరి 30, (విజయక్రాంతి): సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గద్దెలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం సమ్మక్క సారలమ్మ గద్దెలను సందర్శించారు. గద్దెల దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటుచేసిన బందోబస్తును పరిశీలించారు. అక్కడ విధులలో ఉన్న అధికారులు,సిబ్బందికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి వెంకన్నబాబు,సీఐ సురేష్ , సిబ్బంది పాల్గొన్నారు.