calender_icon.png 31 January, 2026 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల మీదే..రక్షణ మీదే, హెల్మెట్‌ధారణ ప్రాణరక్షణ

31-01-2026 12:08:53 AM

మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య

భద్రాచలం, జనవరి 30 (విజయక్రాంతి): తల మీదే రక్షణ మీదే అనే సత్యాన్ని ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు గుర్తించి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తన విలువైన ప్రాణాన్ని కాపాడుకోవాలని సంగం భద్రాచలం వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య కోరారు.  శుక్రవారం నాడు భద్రాచలం రవాణా శాఖ యూనిట్  కార్యాలయంలో  జాతీయ రోడ్డు భద్రత మాసోత్స వాలు సందర్భంగా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ బి రాజశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది కార్యాలయంకు వచ్చిన వారి హెల్మెట్లకు నన్ను ధరించి నిన్ను రక్షిస్తా అనే నినాదం గల రేడియం స్టిక్కర్లను అంటించి, హెల్మెట్ ప్రాధాన్య తను వివరించారు. 

ఈ సందర్భంగా వెంకట పుల్లయ్య మాట్లాడుతూ, ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు నాణ్యమైన హెల్మెట్ను తలకు సరిగ్గా ధరించి, మెడ వద్ద బెల్ట్ క్లిప్ను సరైన విధంగా పెట్టుకొని ప్రయాణం చేయాలని సూచించారు. హెల్మెట్ను సక్రమంగా ధరిస్తే, రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో కూడా తలకు తీవ్రమైన గాయాలు తగలకుండా ప్రాణాలను కాపాడుకోవ చ్చని వివరించారు. రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించి, రోడ్డు ప్రమాదాలను అరికట్టి తమతో పాటు ఇతర రోడ్డు వినియోగదారుల విలువైన ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఏ ఎం వి ఐ బి. రాజశేఖరరెడ్డి, కానిస్టేబుల్ ఎన్. శివయ్య, సిబ్బంది భీముడుతో పాటు కార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.