31-01-2026 12:08:11 AM
అలంపూర్, జనవరి 30: గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వడ్డేపల్లి పురపాలక సంఘం ఎన్నికల్లో ఈసారి రెండు ప్రధాన పార్టీలతో పాటు పేరుగాంచిన ఓ అనుచర వర్గం మధ్య బిగ్ ఫైట్ నెలకొంది. దీంతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరమైన పోటీ నెలకొనే పరిస్థితులు తలెత్తాయి. చైర్మన్ పదవే లక్ష్యంగా ప్రధాన పార్టీలతో మరో బలమైన నేత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. వడ్డేపల్లిలో మొత్తం 10 వార్డులకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది.
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం అలంపూర్లో గెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ప్రాతనిత్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో మరొకసారి పురపాలక ఎన్నికల్లో జెండా ఎగరేసి తమ బలాన్ని ని రూపించుకోవాలని చూస్తోంది.ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్‌ఎస్ ఎలాగైనా పీఠం దక్కించుకోవాలనే లక్ష్యంతో బలమైన నా యకత్వం కలిగిన నాయకులను బరిలో దిం పింది.
కాగా మాజీ జడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు తన అనుచర వర్గంతో ఇటీవలే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.వడ్డేపల్లి లో ఆయనకున్న ప్రత్యేక ఇమేజ్ తో తన అనుచర వర్గాన్ని తెలంగాణ జాగృతి పార్టీ తరఫున బరిలో నిలుపుతోంది. గత ఆరేళ్ల నుంచి ఎలాంటి పదవిలో లేకపోవడంతో ఈసారి ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రచార జోరు మా వర్గం కొనసాగిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఇటీవలే బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి రేపు మొగ్గు చూపారు.వారందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు.దీంతో ఆ పార్టీకి బలం పెరిగి గెలుపు అవకాశాలు అధికార పార్టీ వైపే కనిపిస్తున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతుంది.ఈ బలమైన త్రిముఖ పోటీలో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ పట్టణ ప్రజల్లో నెలకొంది.
మందు విందులతో భారీగా ఖర్చు?
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బరిలో నిలిచిన ఆశావాహులు ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు వార్డుల వారిగా మందు విందులతో మచ్చిక చేసుకున్నట్లు తెలుస్తోంది.నామినేషన్ వేసేందుకు వెళ్తున్న క్రమంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున విందులు మద్యం పంపిణీకి భారీ ఖర్చుగా చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఉత్కంఠ హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారో అన్న చర్చ పట్టణ ప్రజల్లో తీవ్రంగా జరుగుతుంది. ఓటర్లు ఎవరికి మగ్గు చూపుతారో తెలియాలంటే ఫిబ్రవరి 13 వరకు వేచి చూడాల్సిందే.