31-01-2026 12:10:13 AM
పార్టీ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
మణుగూరు,జనవరి 30 (విజయక్రాంతి): కెసిఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమని, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం అంబేద్కర్ సెంటర్ లో ఆ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా జిల్లా అధ్యక్షుడు కాంతారావు మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి కుతంత్రాలకు తెరలేపారని మండిపడ్డారు.
రాజకీయకక్ష లో భాగంగానే కేసీఆర్ ను వేధించేందుకు సిట్ నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఆయనకు కేసులు, కొట్లాటలు, కోర్టులు కొత్తకాదన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడిన చరిత్ర కేసీఆర్ కు ఉందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజల గుండెల్లో నుండి కెసిఆర్ ని తొలగించలే రన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కేసీఆ్ప సిట్ నోటీసును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి పోశం నరసింహారావు నాయకులు వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీని వాస్,దర్శినాల శ్రీను, జావిద్ పాషా, మడి వీరన్న బాబు,అడపా అప్పారావు, వావి లాల నరసయ్య, కంభంపాటి శ్రీనివాస్, రామకోటి, బోసెట్టి రవికుమార్, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.