calender_icon.png 3 February, 2026 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌వి బూటకపు హామీలు మోసపూరిత వాగ్దానాలు

03-02-2026 01:56:07 AM

కేంద్రం ఇచ్చే నిధుల కోసమే స్థానిక ఎన్నికలు

  1. రాష్ట్ర పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోంది

40 శాతం కమీషన్ల పార్టీ కాంగ్రెస్

ఈ ప్రభుత్వమూ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందనే అనుమానం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

కాంగ్రెస్ పార్టీపై చార్జ్‌షీట్ విడుదల

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లు, 420కి పైగా హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ప్రజలు, ఉద్యో గులు, యువతను ఘోరంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు విమర్శించారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో పాలన నడుస్తోందని, మున్సిపాలిటీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పేర్కొ న్నారు.

తెలంగాణ సమాజంలోని అన్నివర్గాలు అసంతృప్తితో ఉన్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్‌కు అవకాశ మిస్తే అందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కాంగ్రె స్ కూడా ట్యాపింగ్ చేస్తున్నదనే అనుమానాలున్నాయని వెల్లడిం చారు. సోమవారం హైదరాబాద్‌లో ని హరిత ప్లాజాలో ‘కాంగ్రెస్‌వి బూటకపు హామీలు వాగ్దా నాలు, అరాచక, అవినీతి పాలన’ అం టూ ఆ పార్టీపై చార్జ్‌షీట్‌ను రాంచందర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి ఆశిష్ శెలా ర్, కో ఇంచార్జి అశోక్ పర్మాని విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. సేవ్ తెలంగాణ.. ఓట్ బీజేపీ పేరిట చార్జి షీట్‌ను రిలీజ్ చేశామని తెలిపారు. కామారెడ్డి, వరంగల్, చేవెళ్ల గ్యారెం టీలు ఇచ్చారు.. కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద జీతాలు ఇవ్వడా నికి కూడా నిధులు లేవని విమర్శించారు. అందుకే కేంద్రం నుంచి వచ్చే నిధుల కోస మే ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రిటైర్డ్ ఉద్యో గుల బెనిఫిట్స్ కూడా ఇవ్వని దుస్థితిలో ఉందని పేర్కొన్నారు. దాదాపు 40 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు..

అయినా సర్కార్‌కు పట్టింపు లేదని ధ్వజమెత్తారు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకే రూ. 1000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి, కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ కింద వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని, పేదలను ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిషన్ కూడా ఇవ్వని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగులకు 4 వేల భృతి ఇస్తా మని చెప్పి విస్మరించిందని దుయ్యబట్టారు. 

ఆ రూ.2,500 కోట్లు ఎటుపోయాయి..?

కేంద్ర పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇచ్చారు అని రాంచందర్‌రావు ప్రశ్నించారు. మున్సిపాలిటీలకు కాంగ్రెస్ చేసింది ఏంటని? బీజేపీతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఎన్నో పథకాలకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ట్యాక్స్ నిధులు దుర్వినియోగం అవు తున్నాయని, 7 మున్సిపాలిటీల్లో ట్యాక్స్‌కు సంబంధించిన దాదాపు రూ.2,500 కోట్లు ఎటు పోయాయో ఎవరికీ తెలియదని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా డ్రగ్స్ చేరిందని, రాష్ట్రంలో హత్యలు, లైంగికదాడులు జరుగుతున్నాయని, శాంతి భద్రత లకు విఘాతం కలుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.

హిందూ ఆలయాలపై దాడు లు జరుగుతున్నాయని, పోలీసులు మాత్రం కూల్చిన వాళ్లను మెంటల్ అని అంటున్నారని, మరి వాళ్లు మెంటలా.. వీళ్లు మెంటలా అర్థం కావడం లేదన్నారు. హోం, లా, మున్సిపల్ శాఖలన్నీ ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయని.. అన్ని విభాగాల్లో సీఎం ఫెయిల్ అయ్యారని విమర్శించారు.

మంత్రులకు ఒకరికొకరికి పడదు..?

రాష్ట్రంలో మంత్రుల్లో ఒకరికొకరికి పడటంలేదని రాంచందర్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో గన్స్ పెట్టి బెదిరించే స్థాయికి పరిస్థితి దిగజారిందని, కాంగ్రెస్‌ది 40 శాతం కమీషన్ల పార్టీ అని, పన్నులు వసూలు చేసి వారి జేబుల్లో దాచుకుంటున్నారని, కానీ ప్ర జలకు మాత్రం ఏమీ చేయడంలేదన్నారు. బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తే వారు అందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కాంగ్రెస్ కూడా ట్యాపింగ్ చేస్తుందనే అనుమానం ఉందని, ఎందుకంటే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని ఆరోపించారు. 

బీజేపీది అభివృద్ధి ఎజెండా: ఆశిష్ శెలార్ 

బీజేపీది ఒకటే ఎజెండా.. అది అభివృద్ధి ఎజెండా అని ఆ విషయం బడ్జెట్ చూస్తేనే అర్థమవుతుంది ఆ పార్టీ ము న్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి ఆశిష్ శెలార్ తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేసిన మోసాలు అన్నీ ఇన్ని కావని, తెలంగాణను చూస్తే ఆవేదనగా ఉందని, ప్రశాం తంగా ఉన్న తెలంగాణను నాశనం చేశారని పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మోసాలపై చార్జీ షీట్ రిలీజ్ చేయడం దురదృష్టకరమని, వాళ్లు మంచి చేస్తే తమకు ఈ అవసరం వచ్చేది కాదని, అవినీతి, మోసాల నుంచి తెలంగాణకు విముక్తి కావాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరా రు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతంరావు, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, సీనియర్ నాయకులు జీ వెంకట్‌రెడ్డి, సునీత, విఠల్, కప్పర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.