calender_icon.png 4 May, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలకు తావు లేకుండా భూ పట్టాల పంపిణీ జరగాలి

03-05-2025 04:45:55 PM

జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘవాన్

కామారెడ్డి (విజయక్రాంతి): సమస్యలకు తావు లేకుండా భూపట్టాల పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువన్(District Collector Ashish Sangwan) అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కన్నాపూర్ గ్రామంలో భూభారతి చట్టం అమలు తీరును పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత అధికారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి రైతులకు ఇవ్వాలని సూచించారు. కన్నాపూర్ గ్రామంలో భూ భారతి సర్వే టీమ్ లు క్షేత్ర పర్యటన చేసి సర్వే నెంబర్ 240 లో ఉన్న భూ వివరాలు, పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... భూ భారతి చట్టం ప్రకారం సాగు చేస్తున్న భూముల వివరాలు, ఎన్ని సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు, సర్వే నెంబర్, భూ విస్తీర్ణం, సాగు చేస్తున్న రైతుల సంఖ్య, తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతమా లేక పట్టా భూమా అనే వివరాలు అటవీ శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేయాలని సూచించారు. ఏళ్ల తరబడి సాగుచేస్తున్న భూ వివరాలను సంబంధిత రైతులను అడిగి తెలుసుకున్నారు. చట్టం ప్రకారం భూముల వివరాలు సేకరించి ఎలాంటి సమస్యలకు తావులేనట్లయితే పట్టా లకు సిఫారసు చేయాలని సూచించారు. అనంతరం పరిమళ గ్రామంలోని రైతువేదిక లో డెస్క్ వర్క్ చేస్తున్న రికార్డ్స్ లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.