calender_icon.png 22 December, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనో వికాసానికి బాలచెలిమి రచనలు

22-12-2025 02:31:30 AM

రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్

బాలచెలిమి జాతీయ కథల పోటీ-25 విజేతలకు బహుమతులు

ముషీరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి):  సమాజ శ్రేయస్సుకు బాలచెలిమి సంకలనాలు ఎంతగానో తోడ్పడతాయని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ అన్నారు. బాలచెలిమి జాతీయ బాలల కథల పురస్కారాల-2025 కార్యక్రమం ఆదివారం హిమాయత్నగర్‌లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డా.రియాజ్ హాజరై మాట్లాడుతూ బాలచెలిమి పత్రిక తెలుగుతో పాటుగా వివిధి భాషలలోకి అనువాదం చేసి, విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.

దేశ వ్యాప్తంగా బాల సాహిత్యానికి సేవలందిస్తున్న యువ కథాకారులు, రచయితలను ఘనంగా సత్కరించారు. నిపుణులైన జ్యూరీ సభ్యుల బృందం పోటీలో వచ్చిన కథలను సమగ్రంగా పరిశీలించి, మూడు విభాగాల్లోని ఉత్తమ కథల నుంచి మొత్తం 36 మంది విజేతలను ఎంపి క చేశారు. బహుమతుల కారక్రమ ప్రారంభోత్సవానికి గరిపల్లి అశోక్ ఆహ్వానించగా, మణికొండ వేదకుమార్ సభకు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ కార్యదర్శి డా.రావి శారధ మాట్లాడుతూ పుస్తకాలు చదవడం అలవాటైతేనే పిల్లలు ఎదుగు తారన్నారు.

డా.రఘు మాట్లాడుతూ బాల చెలిమి ద్వారా వేదకుమార్ బాలసాహిత్య విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ హెచ్. ఎం.కొమ్మ వరవు కృష్ణమ, తడకపాల్ గ్రంథాలయ నిర్వాహకులు ప్రవీణ్ శర్మ, పైడిమర్రి గిరిజ, కూరెళ్ళ శ్రీనివాస్, ధనుంజయ, మాడభూషి లలితా దేవి, అమ్మిన శ్రీనివాస రాజు, అమరవాది నీరజ, పుప్పాల కృష్ణ మూర్తి, భీంపల్లి శ్రీకాంత్, గిరిజ, వడ్డేపల్లి వెంకటేష్, హస్మతుల్లా, బైతి దుర్గయ్య, రాజమౌళి, బాల చెలిమి కన్వీనర్ గరిపల్లె అశోక్, కో-ఆర్డినేటర్ సయ్యద్ ఖైజర్‌లు పాల్గొన్నారు.