16-11-2025 12:17:31 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో బాలల దినోత్సవం ఉత్సాహంగా జరిపారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, ఆసుపత్రి సిబ్బంది అందరూ కలిసి పాల్గొన్న ఈ వేడుకను యూనిట్ హెడ్ ప్రసాద్, ఆయన బృందం ఎంతో సమగ్రంగా నిర్వహించింది. పిల్లల కోసం ప్రత్యే కంగా సరదా కార్యక్రమాలు, ఇంటరాక్టివ్ సెషన్స్, ఆరోగ్యకరమైన అల్పాహారం వంటి ఏర్పాట్లు చేశారు.
ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా ది టాడ్లర్స్ వే పుస్తకం రచయిత డా. చంద్ర శేఖర్ డి.పీ ప్రేరణాత్మక ప్రసంగం నిలిచింది. ప్రతి పిల్లవాడి ప్రత్యేకతను గుర్తించ డం ఎంత ముఖ్యమో తల్లిదండ్రులకు వివరించారు. ‘ప్రతి పిల్లవాడు తనతన ప్రత్యేక తలతో వేరుగా ఉంటాడు. వారి నేర్చుకునే విధానం, ఎదుగుదల, వ్యక్తిత్వ లక్షణాలు వేరేగా ఉంటాయి. పిల్లలను ఒకరితో మరొకరిని పోల్చడం వారి ఆత్మవిశ్వాసం, భావో ద్వేగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అన్నారు.
పెడియాట్రీషియన్, నియో నాటా లజిస్ట్ డా. నవిత పిల్లల అభివృద్ధిపై తన నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్ల లు ప్రోత్సా హం, అర్థం చేసుకునే వాతావరణంలోనే బాగా ఎదుగుతారు. పోలికలు పెట్టడం పిల్లలపై అనవసర ఒత్తిడిని పెంచుతుంది. వారికి కావల్సింది ఓర్పు, మార్గద ర్శనం, మరియు సహజంగా ఎదగడానికి స్వేచ్ఛ, అని ఆమె తెలిపారు. తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి ప్రశంసలు తెలుపుతూ, ఆనందకర కార్యక్రమాలతో పాటు విలువైన సందేశాలు అందించడంతో ఇది ఎంతో ఉపయోగకరమైన వేడుకగా అనిపించిందని చెప్పారు.