28-11-2025 01:01:23 AM
జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్
కొత్తగూడెం, నవంబర్ 27,(విజయక్రాంతి):శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి బాల విద్యా విజ్ఞానిక సైన్స్ ఫైర్ లే తొలిమె ట్టు అని జిల్లా కలెక్టర్‌జితేష్ వి పాటిల్ అ న్నారు.గురువారం సెయింట్ మేరీస్ స్కూల్ లోజిల్లా విద్యాశాఖాధికారి B నాగలక్ష్మి , జి ల్లా సైన్స్ అధికారి B సంపత్ కుమార్ సా రధ్యం లో జరిగిన 53 వ జిల్లా విద్యా వైజ్ఞానిక మూడురోజుల సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పా ల్గొని ప్రసంగించారు. విద్యార్థులలో సైన్స్ ప ట్ల ఆసక్తి మరియు అవగాహన పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్స్ దోహదం చేస్తాయని అన్నారు.
ఈ సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థులకు లభించిన వివిధ అంశాలపై అవగాహన ను భవిషత్ లో ఉపయోగించుకోవాలని సూచించారు. గెలుపు ఓటములను సమా నం గా చూడాలని తాను స్కూల్ లో సైన్స్ ఫెయిర్ లో పాల్గొని ప్రయోగం ప్రదర్శనం చేసానని , కానీ తనకు ప్రైజ్ రాలేదని, అయి నా బాధ పడలేదని అన్నారు.ఆటలాడుతూ నే తాను చదివానని, తన చిన్ననాటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు .
శాస్త్రవెత్తల కృ షి పట్టుదల వలన ఎన్నో విధాలుగు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి లో కి వచ్చిందని వారి ఫలితంలు ఈ రోజు మనం అనుభవిస్తున్నం అని అన్నారు. ప్రతీ విద్యార్థి ఎన్ని సార్లు తన జీవితం లో ఓడిపోయినా, గెలిచేదాకా ప్రయత్నించ్చాలని, విమర్శించడం మా నేసి ఉద్యమించాలని వాటి ఫలితాలు భావితరానికి మీరు అందచేయాలనీ విద్యార్థులకు సూచించారు .
మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారి జీవితాన్ని చదువు కోవాలని సూచించారు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి B నాగలక్ష్మి మాట్లాడుతూ వి ద్యార్థుల భవిష్యత్తు మరియు విజ్ఞానాభివృ ద్ధి కోసం ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ ప్రయో గాలన్నీ పాఠశాలస్థాయి లో అందుబాటులోకి వచ్చేవిధం గా కృషి చేయాలని కోరా రు.
విద్యార్థుల అభివృద్ధి దేశాభి వృద్ధి ఆ దిశగా అందరూ కృషి చేయాలని సూచించా రు.జిల్లా సైన్స్ అధికారి B సంపత్ కుమార్ కృషి ని ప్రశంసించారు. జిల్లా సైన్స్ అధికారి B సంపత్ కుమార్ మాట్లాడుతూ మొత్తం ఏడు విభాగాలలో 649ఇన్స్పైర్ విభాగంలో 84 మొత్తం 733 ప్రయోగాలు ప్రదర్శించ టం జరిగిందని తెలిపారు.ఈ సైన్స్ ఫెయిర్ నిర్విఘ్నం గా జరగటానికి జిల్లా కలెక్టర్ మరి యు జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందుకు నడిపించారని వారికి జిల్లా విద్యా శాఖ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
వివిధ మండల విద్యా శాఖాధికా రులు , ప్రధానోపాధ్యాయులు , సంఘాల నాయకులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు . ప్రయోగాలతో పాటు వివి ధ అంశాలలో కూడా విద్యార్థులు ఉత్సా హం గా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ ఇతర అధికా రులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్న వారి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్న విద్యార్థులకు మొదటి , రెండ వ, మూడవ స్థానం పొందిన విద్యార్థులకు మెమెంటో తో పాటు మెరిట్ సర్టిఫికెట్ మరియు పాల్గొన్న ప్రతి విద్యార్థికి మరియు గైడ్ టీచర్ కు మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది.
సైన్స్ ఫెయిర్ కమిటీల బాధ్యులకు స ర్టిఫికెట్ లు కలెక్టర్ అందచేశారు.అభినందనలుసైన్స్ ఫెయిర్ నిర్వహణకు సహకరించిన సెయింట్ మేరీస్ పాఠశాల హెచ్ ఎం సిస్టర్ రూబీ మరియు యాజమాన్యంను గౌరవ కలెక్టర్ మరియు డీఇఒ లు అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి నీరజ ,సెయింట్ మేరీస్ హెచ్ ఎం సిస్టర్ రూబీ , జిల్లా మానిటరింగ్ అధికారులు నాగ రాజా శేఖర్,. సైదులు ,. సతీష్ మండలం విద్యాశాఖాధికారులు మ ధురవాణి , బాలాజీ జూంకిలాల్ , సత్యనారాయణ.ప్రధానోపాధ్యాయులు సంజీవరా వు, రాములు , ద్రౌపతి, సత్యనారాయణ రె డ్డి, మాధవరావు ,మీడియా ఇంచార్జెస్ షేక్ దస్తగిరి. జహంగీర్ షరీఫ్, రాజయ్య, కళ్యాణి. కమిటీల బాధ్యులు , జడ్జీలు గా ఉన్న లెక్చరర్‌లు, ఉపాధ్యాయులు పాలొన్నారు.