28-11-2025 12:59:41 AM
సర్పంచి పదవి కోసం పోటాపోటీ
ఇల్లెందు, నవంబర్ 27,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నికలకు తొలివిడత జరిగే వాటికి గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మరో వా రం రోజుల్లో రెండో విడత జరిగే వాటికి నా మినేషన్లు వేసే కార్యక్రమం మొదలవ్వనుం ది. ఇక మూడో విడతలో జరిగే వాటి కోసం అభ్యర్థుల ఖరారుకు కసరత్తు మొదలైంది. ఇల్లెందు నియోజకవర్గంలోని రెండు మండలాల్లో మూడో విడతలోనే పంచాయతీ ఎ న్నికలు జరగనున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ ల నుంచి మద్దతు కూడగట్టుకొని గెలుపొందేందుకు అభ్యర్థులు తహ తహలాడుతున్నారు.
గెలుపోటముల సంగతి దేవుడెరుగు కానీ.. సీటైతే ఇవ్వండి గెలిపి చూపిస్తామంటూ అభ్యర్థులు అధినాయకు ల ఇండ్ల ముందు ప్రదక్షణలు చేస్తున్నారు. ఇ ల్లెందు మండలంలో 29 పంచాయతీలు, టే కులపల్లి మండలంలో 36 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఒకటి రెండే ఏకగ్రీవం జరిగే అవకాశం కనిపిస్తు న్నా, మిగతా వాటిలో పోటాపోటి కనిపిస్తుం ది.
ఒకవైపు ఆయా పార్టీల నాయకులు తమ కు అనుకూలులు, గెలువు అనువుగా ఉన్న నాయకుల్ని వేటాడుతుండగా, మరో వైపు ఎప్పటి నుంచో సర్పంచి పదవి పై మోజు పెంచుకొని ఆశపడ్డ నాయకులు ఇప్పుడు ఆ యా పార్టీల నాయకులపై ఎదురు దాడికి ది గుతున్నారు. ఇప్పుడు తమకు సీటివ్వకుంటే, ఒంటిరిగానైనా పోటీ చేసి గెలిచేందుకు సిద్దమంటూ కొందరు ఆశావాహులు ఎదురు దాడికి సిద్దమవుతున్నారు. సమయం సమీపిస్తున్న కొద్దీ సరైన అభ్యర్థుల్ని రంగంలో దించి పోటీకి నిలిపితేనే గెలు పు సాధ్యమన్నట్లు నాయకులు వ్యవహరిస్తున్నారు.
రూ. లక్షల్లో ఖర్చు చేసైనా గెలుస్తామంటూ తమ కు అనుకూలమైన వారిని కూ డగట్టుకొని మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే కాం గ్రెస్ మండలాల వారిగా సమన్వయ కమిటీలను వేసి వారితో ఆయా పం చాయతీల్లో కలియతిరుగుతూ స్థానిక పార్టీ నాయకులతో చర్చించి అభ్యర్థి ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నాయకులు పంచాయతీల వారిగా సమావేశాలు పెడుతూ గెలిచే అభ్యర్థిని ఎంపిక చేయాలని స్థానికుల అభిప్రాయలను సేకరిస్తున్నారు. స్థానికత, సొంత బలం ఉన్న అభ్యర్థిని నిలబెడితే గెలుపు సాధ్యమన్న రీతిలో వ్యవహరి స్తున్నారు.
కొన్ని పంచాయతీల్లో ఒక్కో పార్టీ నుంచి ఐదారుగురు పోటీ పడుతుండటం తో నాయకులకే తలనొప్పిగా త యారై ఏమీ చేయని స్థితిలో ఉన్నారు. ఎవరితోనీ విభేదాలు రాకుండా అందరినీ సామరస్యంగా బుజ్జగింపు దోరణితో గట్టి పోటీ ఉన్న చోట విరమింప చేసేందుకు నాయకులు ప్రయ త్నం చేస్తున్నారు. అటు సీటివ్వకుంటే మరో వైపు వెళ్లేందుకు కొందరు ఆశావాహులు ఎదురు చూస్తుండటంతో ఆయా పార్టీల నా యకులు తమ నుంచి జారిపోకుండా జా గ్రత్త పడుతున్నారు.
ఎవరికి వారు ఎక్కువ సర్పంచి స్థానాలు గెలుపొందాలన్న లక్ష్యం తో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వ్యూహం రచిస్తున్నా రు. మాజీ సర్పంచులు తమతమ స్థానాలను భద్ర పరుచుకునే ప్రయత్నం చేస్తున్నా, స్థాని క బలం లేక కొందరు ఇబ్బంది పడుతున్నా రు. మరికొందరు ఎట్టాగైనా పోటీ చేసి మళ్లీ గెలవాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నా రు. సమయం సమీపిస్తుండటంతో గ్రామా ల్లో ఎన్నికల సందడి పెరిగింది.