calender_icon.png 3 November, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల భద్రత మీ చేతుల్లోనే..

03-11-2025 01:43:02 AM

  1. స్కూల్ బస్సులపై పరిశీలన ముఖ్యం
  2. ప్రమాణాలు పాటించకపోతే ఫిర్యాదు చేయాలి

సిద్దిపేట క్రైం, నవంబర్ 2 : పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎంత ఖర్చుకైనా వెనకడుగు వేయడం లేదు. పిల్లలను చేర్పించేటప్పుడు విద్యాసంస్థల్లో వసతులు, బోధన సిబ్బంది గురించి ఆరా తీస్తారు. కానీ, ము ఖ్యమైన రవాణా సౌకర్యం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. విద్యార్థులను క్షేమం గా ఇంటికి చేర్చే విద్యా సంస్థల బస్సు ఫిట్నె స్, అనుభవజ్ఞులైన డ్రైవర్లు, నిబంధనల మే రకు వాహనం ఉందా అన్నది పరిశీలించడం లేదు.

ఈ ముఖ్యమైన తనిఖీ మరియు లోపా ల సవరణ ప్రక్రియలో తల్లిదండ్రులు కూడా భాగం కావాలి.విద్యార్థుల భద్రత కోసం క్షు ణ్ణంగా పరిశీలించాలి. ఏవైనా లోపాలు ఉం టే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. వెంట నే పరిష్కరించాలని డిమాండ్ చేయాలి.

 ఫిర్యాదు చేయండి

యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోతే, ఆర్టీవోకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఫోన్ నంబర్ను ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను డిమాండ్ చేయండి. ఏఐఎస్ 063, ఏఐఎస్ 135, సీఎంవీ రూల్ 96 & 118 ప్రకారం...

 బస్సు రూపకల్పన, భద్రతా పరికరాలు పరిశీలించాలి. బస్సు తప్పనిసరిగా గోల్డెన్ ఎల్లో రంగులో ఉండాలి. దానిపై ‘స్కూల్ బస్సు‘ లేదా ‘ఆన్ స్కూల్ డ్యూటీ‘ అని స్పష్టంగా రాయాలి. డ్రైవర్ డోర్కు ఎదురుగా మరియు వెనుక వైపున ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి. డోర్ తెరవగానే డ్రైవర్కు బజర్/హెచ్చరిక అందాలి. అన్ని సీట్లు ముందుకు చూసేలా ఉండాలి. స్కూల్ బ్యాగుల కోసం సీట్ల కింద స్టోరేజ్ రాక్లు (300 మి.మీ లోతు) తప్పనిసరి. ఎంట్రీ లేదా ఫుట్ స్టెప్ భూమి నుండి 300 మి.మీ కంటే ఎక్కువ ఎత్తులో ఉండకూడదు.

కిటికీలకు గ్రిల్స్, ఫస్ట్-ఎయిడ్ కిట్, అగ్నిమాపక యంత్రం, జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ మరి యు సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చాలి. పాఠశాల బస్సుల్లో స్పీడ్ గవర్నర్ ఉండాలి. గరిష్ట వేగం 40 కి.మీ/గం కంటే మించకూడదు. ఇంజిన్ కంపార్ట్మెంట్లో ఎఫ్డిఏఎస్/ఎఫ్డిఎస్‌ఎస్ అమర్చాలి. ప్రయాణీ కుల కంపార్ట్మెంట్లో ఎఫ్‌ఏపిఎస్ ఉండాలి, అగ్నిని గుర్తించినప్పుడు ధ్వని, దృశ్య సంకేతాలు అందాలి. చిన్న పిల్లలు ఉన్న బస్సులకు లేడీ అటెండెంట్/కండక్టర్ తప్పనిసరిగా ఉండాలి.

డ్రైవర్కు కనీసం 5 సంవ త్సరాల అనుభవం ఉండాలి. డ్రైవర్ వివరాలు బస్సులో ప్రదర్శించాలి. బస్సు కదు లుతున్నప్పుడు డోర్స్ లాక్ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు, ట్రాన్స్పోర్ట్ పర్మిట్, బీమా, పీయూసీ అన్నీ చెల్లుబాటులో ఉండాలి. భద్రతా లోపాలపై ఫిర్యాదు లు, సందేహాలు లేదా మద్దతు కోసం ట్రాఫిక్ పోలీస్ అధికారులను సంప్రదించాలి.