05-05-2025 09:38:13 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలో గాలివాన బీభత్సానికి నష్టపోయిన మామిడి తోటలు, రైతు కుటుంబాలను సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) సందర్శించారు. నెన్నల మండలంలో ఇటీవల ఈదురు గాలుతో కురిసినకాల అకాల వర్షాలకు నేలమట్టమైన ఇండ్లను, నష్టపోయిన మామిడి తోటలని చూశారు. ఈదురు గాలులు భారీ వర్షానికి నెన్నెల మండలం ఆవడం, గంగారం, చిత్తాపూర్ గ్రామాలలోని మామిడి తోటలు గృహాలు నష్టపోయాయి.
ముందుగా ఎమ్మెల్యే నెలమట్టమైన మామిడి తోటలను సందర్శించారు. నేలమట్టమైన గృహదారులు, రైతులను పరామర్శించారు. నష్టపోయిన ఇళ్లకు, రైతుల పంట నష్టానికి పరిహారం ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అందుకోసం పూర్తి నివేదికను తయారు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులు గృహాలను కోల్పోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. నెన్నెల మాజీ ఉప సర్పంచ్ పుప్పాల అంజన్న తల్లి పుప్పాల తారక్క ఇంట్లో నిద్రిస్తుండగా ఇటీవలే కురిసిన వడగండ్లవాన వల్ల ఇంటి పైకప్పు కూలి గాయపడింది. ఆమె కూడా పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట బెల్లంపల్లి ఆర్డిఓ హరికృష్ణ, రెవెన్యూ అధికారులు ఉన్నారు.