- ముగ్గురిని నిర్బంధించిన అధికారులు
- పాస్‌పోర్టులను సైతం అప్పగించాలని ఆదేశం
బీజింగ్, సెప్టెంబర్ 12: ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లపై చైనా దృష్టి సారించింది. వారిని నియంత్రించేందుకు జిన్‌పింగ్ సర్కారు సిద్ధమైంది. ఆగస్టులో ముగ్గురు ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లను చైనా అధికారులు బంధించినట్లు బ్లూమ్‌బర్గ్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ వార్త వెలువడిన అనంతరం చైనాలో ఆ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బందీ అయిన ముగ్గురిలో ప్రభుత్వ రంగానికి చెందిన హైటాంగ్ సెక్యూరిటీస్ బ్యాంకర్ దేశం నుంచి పారిపో యాడు. అయితే ఆతడిని విదేశాల్లో అరెస్టు చేసి చైనాకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
గతేడాది ఓ కేసు దర్యాప్తు నిమిత్తం అదుపులోకి తీసుకున్న ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ బావో ఫాన్ అదృశ్యం కూడా అప్పట్లో కలకలం సృష్టించింది. తాజాగా షెన్‌వాన్‌హాంగ్‌యువాన్ గ్రూప్ జీఎం వాంగ్‌జెపింగ్, గువాన్ సెక్యురిటీస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ చీఫ్ వాంగ్‌చెన్‌ను అధికా రులు బంధించారు. వీరి పాస్‌పోర్టులను అప్పజెప్పాలని అధికారులు కోరారు. విదేశీ పర్యటనలపైనా ఆంక్షలు విధించారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలన్నా అనుమతు లు తీసుకోవాలని తెలుస్తోంది. విదేశీ పర్యటనల్లో ఆయా సంస్థల సహోద్యోగి తప్పని సరిగా వీరితో ఉంటారు.
ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో వీరు తమ కార్యకలాపా లను పూర్తి చేయాల్సి ఉం టుంది. చైనాలో బ్రోకరేజీ ఇండస్ట్రీ, దేశీయ మార్కెట్ కార్యకలాపాల విలువ 1.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ చర్యలతో ఈ రంగంలో పనిచేసే ఉద్యోగుల స్థుర్యైన్ని దెబ్బతీస్తాయని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 147 ప్రముఖ బ్రోకరేజీ సంస్థల్లో 8,700 మంది ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు ఉన్నారు. వీరు ఐపీవో, షేర్ల విక్రయాల కార్యకలాపాలను నిర్వహిస్తారు.