calender_icon.png 29 December, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియా పోరుకు సన్నద్ధం!?

29-12-2025 02:46:22 AM

  1. ఫిబ్రవరిలో ఎన్నికలంటూ ఊహాగానాలు

మొదలైన ఆశావహుల ప్రయత్నాలు

మున్సిపాలిటీల్లో మొదలైన రాజకీయ వేడి

సంగారెడ్డి, డిసెంబర్ 28(విజయక్రాంతి) :మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమవుతోందా అంటే అవుననే సంకేతాలు వెల్లడవు తున్నాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార కాంగ్రెస్ అదే ఊపుతో ముందుకు సాగుతోంది. వచ్చే ఫిబ్రవరిలో బల్దియా ఎన్నికలు జరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించడంతో త్వరలోనే పట్టణ ఎన్నికలకు నగారా మోగే అవకాశం కనిపిస్తోంది.

ఆశావహులు ఇప్పటికే తమ ప్రయత్నాలు షురూ చేశారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే రొటేషన్ విధానంలో ఎన్నికలు జరగనున్నప్పటికీ స్పష్టత రావాల్సి ఉంది. రాజకీయ పార్టీల గుర్తులతో నిర్వహించే ఈ ఎన్నికల్లో చైర్మన్ ను నేరుగా ఎన్నుకునేలా ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఆ దిశగా దృష్టి సారించాయి.

పాత రిజర్వేషన్ల ప్రకారమే..

రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభు త్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. మున్సిపల్ ఎన్నికలు సైతం అదే రిజర్వేషన్లతో నిర్వహించను.