calender_icon.png 25 August, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15వ తేదీన సీతారామ ప్రాజెక్టు 3 పంపులు ప్రారంభిస్తాం

13-08-2024 05:59:21 PM

హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 15వ తేదీన సీతారామ ప్రాజెక్టు 3 పంపులు ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2026 ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. నీటి పారుదల శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, గత ప్రభుత్వం రూ.1.81 లక్షల కోట్లతో నామమాత్రంగా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టుకు రూ.7,436 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ధ్వజమెత్తారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ పెండింగ్ పనులు పూర్తి చేయలేదని, నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయిస్తున్నామన్నారు.