26-12-2025 12:16:38 AM
తూప్రాన్/మనోహరాబాద్, డిసెంబర్ 25 :తూప్రాన్ పట్టణ కేంద్రంలోని సిఎస్‌ఐ చర్చ్ లో యేసు క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టరేట్ ప్రెస్ బీటర్ ఇంచార్జి రేవ్.పి.వీణా వసంతకుమార్ యేసు పుట్టుకను గూర్చి నిక్షిప్తంగా వివరించారు.
ఈ వేడుకల్లో కమిటీ ఆఫీసర్స్, బెన్ని, కమిటీ మెంబెర్స్ దేవయ్య, సంఘపెద్ద సంతోషయ్య, ప్రవీణ్, కిరణ్మయమ్మ, దావీదు, స్టివర్డ్ జాని, సాయికుమార్, మహిళలు యువకులు చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
మనోహరాబాద్ లో..మనోహరాబాద్ సిఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో మండల మైనార్టీ అధ్యక్షులు జావిద్ పాషా పాల్గొన్నారు. అనంతరం వారితో కలసి భారీ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో శంకర్, ఆదిల్ పటేల్, కృష్ణ, కోచాలు, అంజి, భాస్కర్, మధు, మహేందర్ పాల్గొన్నారు.