calender_icon.png 26 December, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగునాట గత వైభవం

26-12-2025 02:01:53 AM

కాలాలు, గత వైభవాల చుట్టూ రూపుదిద్దుకున్న సినిమా ‘గతవైభవం’. మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోతున్న సందర్భంలో తెలుగు నాట విడుదలై, కొత్త సంవ త్సరం సందర్భంగా ఇక్కడి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచనుంది. గత నెలలో కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నేతత్వంలోని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ జన వరి 1న తెలుగులో రిలీజ్ చేయనుంది. 

ప్రేమ, పురాణం, పునర్జన్మ, చారిత్రక నాట కం కలగలిసిన ఈ సినిమాలో ఎస్‌ఎస్ దుష్యంత్, ఆషిక రంగనాథ్ నాయకానాయికలు. సర్వేగర సిల్వర్ స్క్రీన్స్‌తో కలిసి సునీ సినిమాస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంది. సునీ దర్శకత్వం వహించడమే కాకుండా, దీపక్ తిమ్మప్పతో కలిసి ఈ చిత్రానికి సహ నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ చిత్రానికి జుడా శాండీ సంగీతం సమకూర్చగా, విలియం జే డేవిడ్ డీవోపీని అందించారు. శివకుమార్, ఉల్లాస్ హైదర్, రఘు మైసూర్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వర్తించారు.