26-12-2025 12:15:39 AM
మునిపల్లి, డిసెంబర్25 : మండల పరిధిలోని మల్లికార్జున్ పల్లి గ్రామ సర్పంచ్ అభ్య ర్థిగా బరిలో నిలిచిన బేగరి మల్లేశం సర్పంచ్ ఎన్నికల ముందు తాను గెలిస్తే గ్రామ శివారులో గల వాసల్ ఖాసాయబ్ దర్గాలో ప్ర త్యేక పూజలు చేస్తానని మొక్కుకున్నాడు.
ఈ మేరకు బేగరి మల్లేశం మల్లికార్జున్ పల్లి స ర్పంచ్ గా గెలుపొందడంతో గురువారం ఆ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్, నాయకులు కార్తీక్, పాండు, బుచ్చయ్య, బుచ్చన్న, బక్కన్న, విష్ణు, వజీర్, లక్ష్మణ్, సురేష్ తదితరులు ఉన్నారు.