calender_icon.png 26 December, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ యాదవరెడ్డికి పార్టీ మారే ఉద్దేశం లేదు.. రాదు

26-12-2025 12:17:59 AM

  1. ఆయన పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు

బీఆర్‌ఎస్ గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు

గజ్వేల్, డిసెంబర్ 25: ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డికి పార్టీ మారే ఉద్దేశం లేదని, భవిష్యత్తులోనూ రాదని గజ్వేల్ మండలం బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బెండ మధు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఇటీవల తెలంగాణ భవన్లో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారని, నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ సర్పంచులను సన్మానించడంతోపాటు, పార్టీ మెదక్ లో నిర్వహించిన ఇసుక మాఫియా పై నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారన్నారు.

ల్లప్పుడూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల సూచన మేరకు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నాయకులను కార్యకర్తలను ముందుకు నడిపిస్తున్నారన్నారు. పార్టీలో ఆయన సలహా సూచనలతో నాయకులు కార్యకర్తలు పని చేస్తున్నారని వెల్లడించారు. బిఆర్‌ఎస్ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి కెసిఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో పాటు భారీ మెజారిటీతో గెలిచేలా చేశారన్నారు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.