26-12-2025 02:19:33 AM
హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్
ఎల్బీనగర్, డిసెంబర్ 25 : మాజీ ప్రధాని వాజపేయి దేశానికే దార్శనికుడు అని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రాసేనారెడ్డి అన్నారు. ఎల్బీనగర్ - కామినేని దవాఖాన రోడ్డులో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజపేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు హాజరయ్యారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గవర్నర్ నల్లు ఇంద్రాసేనారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ... అటల్ బీహారీ వాజపేయి జీవితం రాజకీయ విలువలకు ప్రతీక అన్నారు. రాజకీయాలకు గౌరవం తీసుకొచ్చిన మహానాయకుడని, అధికారం కోసం కాకుండా సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలు చేసిన వ్యక్తిగా వాజపేయిని కొనియాడారు. దేశ రక్షణకు ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినా ధైర్యంగా అణు పరీక్షలు నిర్వహించి భారత దేశం సత్తాను చాటి చెప్పారని అన్నారు. ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ అనే నినాదంతో దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసిన గొప్ప నేత అన్నారు.
ప్రధానిగా వాజపేయి బాలిక విద్య, మహిళా అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు కొప్పుల నర్సింహరెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వంగా మధుసూదన్ రెడ్డి, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, లచ్చిరెడ్డి, రంగా నర్సింహగుప్తా తదితరులు పాల్గొన్నారు.
ఘట్‌కేసర్‌లో
ఘట్ కేసర్, డిసెంబర్ 25 (విజయక్రాంతి) : దేశ మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయి జయంతి వేడుకలను గురువారం ఘట్ కేసర్ పట్టణంలో బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి హనుమాన్ మాట్లాడుతూ నిష్కలంక దేశభక్తుడు, తన పూర్తి జీవితాన్ని భారతమాత సేవకే అంకితం చేసిన మహనీయుడు, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నేటి బిజెపి కార్యకర్తలకు ఆరాధ్య దైవంగా భావించే మాననీయ వాజ్ పాయ్ బాటలోనే నడుస్తూ వారి ఆశయాలను సాధించి పార్టీ ని మరింత బలోపేతం చేస్తామన్నారు.
అటల్ జీ జయంతి సందర్బంగా సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీరాములు ని అధ్యక్షులు మహిపాల్ రెడ్డి సన్మానించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు పల్లె మధు, మున్సిపల్ ఉపాధ్యక్షులు గుండ్ల రామతీర్థ గౌడ్, ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్, రాధిక, కార్యదర్శి మడిపడిగే అంజయ్య, కోశాధికారి మేడబోయిన నరేష్, యువమోర్చ అధ్యక్షులు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, సురేంద్ర, సీనియర్ నాయకులు పల్లె మధు, శ్రీరాములు, పల్లె ఆంజనేయులు, మంగు శ్రీనివాసరావు, వై. శ్రీనివాస్ రెడ్డి, పడమటి భూపాల్ రెడ్డి, మోటే మధుసూదన్, ప్రశాంత్ బూత్ అధ్యక్షులు కిరణ్, మమతా శర్మ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
జయంతి సందర్భంగా నివాళులు
మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా బిజెపి నాయకులు మేడ్చల్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్ పేయి సేవలను కొనియాడారు.
జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్,బాలేష్, చెరుకొమ్ము శ్రీనివాస గౌడ్, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా, ఆర్ శ్రీనివాస్ గౌడ్, బొజ్జ వంశీధర్ రెడ్డి, జాకట ప్రేమ దాస్ తదితరులు నివాళులర్పించారు.
ఘనంగా వాజ్‌పేయి జయంతి
వికారాబాద్, డిసెంబర్-25: పట్టణంలోని ఎన్టీఆర్ చౌరాస్తాలో పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్ పాయి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ అద్యక్షుడు మాదవరెడ్డి మాట్లాడుతూ అణుపరీక్షలతో భారత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
గ్రామీణ సడక్ యోజనతో పల్లెను పురో నడిపించారన్నారు. రాజకీయాల్లో నైతికతకు స్థానం ఉందని నిరూపించిన మహానుభావుడన్నారు. ఆయ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు శివరాజు, పట్టణ పార్టీ అద్యక్షురాలు యాస్కి శిరీష, జిల్లా సీనియర్ నాయకులు శ్రీధర్రెడ్డి, పాండుగౌడ్, కేపీ రా వివేకనంన్రెడ్డి, నరోత్తంరెడ్డి, రాజేందర్రెడ్డి, చరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.