26-12-2025 12:28:16 AM
తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దమ్మి గారి కనకయ్య
చేగుంట, డిసెంబర్ 25 :చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో ఈనెల 26న నిర్వహించనున్న కామ్రేడ్ కేబుల్ కిషన్ ముదిరాజ్ జాతరను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దమ్మిగారి కనకయ్య చేగుంటలో వాల్ పోస్టర్ ఆవిష్కరిస్తూ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూస్వాముల గుండెల్లో దడ పుట్టించి, రైతుల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ అని కొనియాడారు.
ఆయన సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేవలం కిషన్ జాతర నిర్వహణకు 5 లక్షలు కేటాయించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండ గోపాలకృష్ణ, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, చేగుంట మండల అధ్యక్షులు కాశ బోయిన పెద్ద భాస్కర్, యూత్ అధ్యక్షులు పుల్లబోయిన రవి, సోమ సత్యనారాయణ, తలారి షాదుల్లా, చేగుంట పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, సోమ వెంకట్, సోమ భూములు, కాశ బోయిన మహేష్ పాల్గొన్నారు.