26-12-2025 12:07:21 AM
ఘనంగా క్రిస్మస్ వేడుకలు గ్రామ ఐక్యతకు ప్రతీకగా క్రిస్మస్ వేడుకలు
భీమదేవరపల్లి, డిసెంబర్ 25 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంముత్తారం గ్రామంలోని ఏసురత్నం ఎలిజబెత్ మెమోరియల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. పాస్టర్ ఎజ్రా, మాసిలామణి ఆహ్వానంతో గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొని వేడుకలకు శోభ చేకూర్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఊరడి భారతి జైపాల్ రెడ్డి దంపతులు, ఉపసర్పంచ్ మాట్ల హరికుమార్, వార్డు సభ్యులు దైవ సేవకులను సన్మానించారు. జనవరి 1 న, దైవ కార్యక్రమానికి ప్రేమ విందు ఏర్పాటు చేస్తామని సర్పంచ్ తెలిపారు.
అనంతరం ప్రత్యేక ప్రార్థనలు, కేక్ కటింగ్ నిర్వహించారు. ఇదే సందర్భంగా ముల్కనూర్ గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని గ్రామంలోని వివిధ చర్చిలను సందర్శించి, క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. మతాల మధ్య ఐక్యత, శాంతి భావన మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల గోపి, గుడికందుల బాలరాజు, గద్వాల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.