26-12-2025 12:08:26 AM
వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 25(విజయక్రాంతి):ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మొర్రవనిగూడెంలోని జి టి ఎస్ ఎస్ ఎస్ ప్రార్ధన మందిరంలో క్రిస్టమస్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు.
పర్వదినం సందర్భంగా మందిరంలో ప్రపంచంలో క్రీస్తు జననం సంతోషకరమని ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అనేకమందికి రక్షకుడుగా ఉన్నాడని ఇటువంటి పండుగలు జరుపుకోవడం చాలా సంతోషమని సంఘ కాపరి ముర్రం డేవిడ్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఏసుక్రీస్తు లోక రక్షకుడని, యేసు క్రీస్తు ద్వారా శాంతి సమాధానం కలుగుతుందని, ప్రపంచ దేశాలలో పండుగగా నిర్వహించుకునే ఏకైక పండుగ క్రిస్టమస్ అని వారు తెలియజేశారు. ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు.
చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు చర్చి ఆవరణంలో స్టార్ , క్రిస్మస్ తాత బొమ్మలను ఏర్పాటు చేశారు. విశ్వాసులకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ మొర్రం ఇసాక్, మొర్రం డేవిడ్, విక్టోరియా, కోడేపే ఏలీయా, ఆగస్టీన్, జ్యోతి, ఎనాసు, నయొమి, సున్నం యేసు, పూజారి క్రిష్ణ విశ్వాసులు, గ్రామస్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.