calender_icon.png 26 December, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీస్తు బోధనలు ఆదర్శనీయం

26-12-2025 12:26:58 AM

  1. నీలం మధు ముదిరాజ్

నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసిన నీలం మధు

పటాన్ చెరు, డిసెంబర్ 25 :శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆదర్శనీయం, అనుసరణీయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.గురువారం క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్కుల్ పరిధిలోని బ్యులా, ఎంవీ చర్చిలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని కేక్ కట్ చేసి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నిర్వాహకులతో కలిసి వికలాంగులకు నిత్యావసర సరుకులు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ మానవుడిగా ప్రజల మధ్యనే నడయాడి సమాజానికి శాంతి సందేశం అందించిన దయామయుడు యేసుక్రీస్తు అని కొనియాడారు. క్రీస్తు చూపిన శాంతి మార్గం సర్వ మానవాళికి స్ఫూర్తి దాయకమని, ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ ప్రతి ఒక్కరూ ప్రేమ, జాలి, దయా గుణాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బ్యూలా చర్చి నిర్వాహకులు ప్రకాష్ రావు, రాజ్యలక్ష్మి, ఎంవీ చర్చి నిర్వాహకులు శ్రీమాన్, వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు రవి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, రజక సంఘం రాష్ట్ర నాయకులు సిహెచ్ వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు గోపాల్, రాజ్ కుమార్, గౌరి శంకర్, అనిల్, నిర్వాహకులు, క్రైస్తవ నాయకులు, ఎన్‌ఎంఆర్ యువసేన సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.