07-09-2025 12:32:51 AM
మున్నూరు కాపు సంఘం యూత్ స్టేట్ ప్రెసిడెంట్
చెన్నూర్,(విజయక్రాంతి): రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు మద్దతు తెలుపున్న మున్నూరు కాపు యువకుడిపై సీఐ చేయి చేసుకోవ మీడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మున్నూరు కాపు సంఘం యూత్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శనివారం చెన్నూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమయంలో ఆయన మాట్లాడారు. మూడవ తేదీన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సమీపంలో యూరియా కోసం జరుగుతున్న ధర్నాకు మద్దతు ఇచ్చిన మాజీ కౌన్సిలర్ దోమకొండ అనిల్ పై చెన్నూర్ పట్టణ సిఐ దేవేందర్ రావు చేయి చేసుకోవడం హేమమైన చర్య అని అన్నారు.
వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే మున్నూరు కాపు సంఘం తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి చెన్నూరు పట్టణ బంద్ తదితర కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గతంలో కూడా మున్నూరు కాపు బిడ్డల పైన పోలీసులు చేయి చేసుకున్నారని, ఇక ముందు అలాంటి సంఘటనలు జరగకుండా చెన్నూరు మున్నూరు కాపు బిడ్డలకు రాష్ట్ర సంఘం అండగా ఉంటుందని అన్నారు.