07-09-2025 12:33:27 AM
రాజకీయాలు భలే గమ్మత్తుగా ఉం టాయ్! రాజకీయా ల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేవారు ఉండరు. అలాగే కుటుంబ బం ధాలు కూడా ఉండవని చెప్పొ చ్చు. బీఆ ర్‌ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ తర్వాత స్థానం కవితదే ఉండే ది. పార్టీలో ఉన్నప్పు డు గౌరవం.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారం.. రెండూ ఆమెకు దక్కేవి. కానీ కవిత పార్టీ నుంచి బయటికి వెళ్లాక... నిన్నటి వరకు జై కొట్టిన నోర్లే.. ఇప్పుడు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
పార్టీలో నెంబర్ త్రి స్థానంలో ఉండి జిందాబాద్‌లు, జేజేలు అందుకున్న ఆమె.. ఇప్పుడు ఒకప్పటి సొంతపార్టీ నేతలతోనే తిట్లు తినాల్సి వస్తోంది. మీడియా సమావేశాలు పెట్టి మరీ ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. కవిత వర్సెస్ బీఆర్‌ఎస్ అన్నంతగా విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్నాయి. కవిత కూడా అదే స్థాయిలో బీఆర్‌ఎస్‌లోని పలువురు నేతలపై ఘాటు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.. రాజకీయాలను కాస్త పక్కనబెడితే.. కవిత పరిస్థితిని గమనిస్తున్న జనంలో కొందరేమో సొంత పార్టీతోనే కవితకు ఎన్ని కష్టాలొచ్చాయోనని ఆమె పట్ల సానుభూతి చూపుతుంటే, మరికొంత మందేమో ఇది రాజకీయాల్లో సర్వసాధారణమైనని చర్చించుకుటున్నారు.
రమేశ్ మోతె