07-09-2025 12:32:37 AM
గుండెపోటుతో మరణించిన మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి
నారాయణపేట, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జ న ఉత్సవాల్లో ఒక వ్యక్తి మృతి చెందిన సం ఘటన అందరిని కలచి వేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట మున్సిపాలిటీ మంచినీటి సరఫరా విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న బురుడువాడి నివాసి శాసన్ పల్లి శేఖర్(45) గుండె పోటుతో మృతి చెందాడు. వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అందరూ ప్రత్యేక నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతున్న సమయం లో అనుకోకుండా శేఖర్ కిందపడ్డాడు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు తేరుకున్నప్పటికీ పరిస్థితి విషమించింది. దీంతో శేఖర్ మృతి చెందాడు. గుండెపోటుకు గురై న విషయాన్ని గమనించిన స్థానిక ఎస్సు అందే వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్ సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని నారాయణపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా వ్యక్తి గుండెపోటుకు ప్రధాన కారణం అధిక శబ్దం కారణం కావచ్చని పలువురు పేర్కొంటున్నారు.